World Mosquito Day: దోమలకూ ఒక రోజు ఉంది.. అదే “ఆగస్టు 20” !!
దోమల ద్వారా వ్యాపించే మలేరియా వంటి వ్యాధులపై ప్రజలను అలర్ట్ చేయడమే “ప్రపంచ దోమల దినోత్సవం” లక్ష్యం.
మనుషుల్లో మలేరియాను వ్యాపింపజేసేది ఆడదోమే అని బ్రిటన్ కు చెందిన వైద్యరంగ శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ కనుగొన్నారు.
ఈవిషయాన్ని 1897లో ఆగస్టు 20న ఆయన ధృవీకరించారు.
మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకుగానూ 1902లో వైద్యశాస్త్రంలో రొనాల్డ్ రాస్ కు నోబెల్ బహుమతి లభించింది.
Also read : Railway Recruitment 2023: రైల్వే శాఖలో ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇలా అప్లై చేసేయండి..!
మన సికింద్రాబాద్ వేదికగా దోమలపై తొలి రీసెర్చ్..
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే .. రొనాల్డ్ రాస్ మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న అల్మోరాలో జన్మించారు. ఆయన తండ్రి “కాంప్‌బెల్ రాస్” బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జనరల్ గా పనిచేసేవారు. 1874 లో లండన్ లోని సెయింట్ బార్తోలోమేవ్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో రొనాల్డ్ రాస్ చేర్చాడు. కోర్సు పూర్తయిన తర్వాత 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసులో చేరి, తొలుత మద్రాసులో పనిచేశాడు. 1881 నుంచి 1894 వరకు మద్రాస్, బర్మా, బలూచిస్తాన్, అండమాన్ దీవులు, బెంగళూరు, సికింద్రాబాద్ లలో వైద్య అధికారిగా వివిధ పదవులలో రొనాల్డ్ రాస్ సేవలు అందించారు. 1883 లో ఆయనను బెంగళూరుకు యాక్టింగ్ గారిసన్ సర్జన్ హోదాలో పంపించారు. బెంగళూరులో ఉన్న సమయంలోనే.. నిల్వ ఉన్న నీటిలో దోమలు సంతానోత్పత్తి చేసుకుంటాయని రొనాల్డ్ రాస్ గుర్తించారు. నీరు నిల్వ ఉండకుండా చేస్తే దోమల సంతానోత్పత్తికి అడ్డుకట్ట వేయొచ్చనే అభిప్రాయానికి వచ్చారు. 1894 మార్చిలో ఆయన సెలవు తీసుకొని తన కుటుంబంతో లండన్ కు వెళ్లారు. 1894 ఏప్రిల్ 10న లండన్ లో “సర్ పాట్రిక్ మాన్సన్” అనే శాస్త్రవేత్త ను రొనాల్డ్ రాస్ కలిశారు. రాస్ కు గురువుగా మారిన మాన్సన్, మలేరియా పరిశోధనలో ఆయనకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. మలేరియాపై రీసెర్చ్ కు భారతదేశం ఉత్తమమైన ప్రదేశమని రొనాల్డ్ రాస్ కు మాన్సన్ చెప్పారు.
Also read : UAE vs NZ: చరిత్ర సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి..!
ఊటీ టూర్ లో ఆ విషయం తెలుసుకొని..
దీంతో రాస్ మళ్లీ సికింద్రాబాదుకు చేరుకుని.. అక్కడున్న తన పరిశోధనా సామాగ్రిని తీసుకుని నేరుగా బొంబాయి సివిల్ హాస్పిటల్ కు చేరుకున్నారు. అక్కడ మలేరియా రోగులను కలిసి వారి రక్త నమూనాలను సేకరించారు. 1895 మేలో దోమల కడుపు లోపల మలేరియా పరాన్నజీవి ప్రారంభ దశలను తొలిసారి రాస్ గుర్తించారు. ఇది ఆయన పరిశోధనలో తొలి అడుగు. అయితే ఇదే టైంలో కలరా వ్యాధిపై పరిశోధన చేయడానికి రొనాల్డ్ రాస్ ను బెంగళూరుకు పంపించారు. దీంతో ఆయన ఎంతో నిరాశకు గురయ్యారు. బెంగుళూరులో కలరాపై రీసెర్చ్ చేస్తున్నా.. మలేరియా వ్యాధి చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతుండేవి. బెంగళూరులో రీసెర్చ్ చేయడానికి మలేరియా రోగులు కూడా రాస్ కు దొరకలేదు. 1896 ఏప్రిల్‌లో ఆయన తమిళనాడులోని ఊటీ హిల్ స్టేషన్ కు సమీపంలో ఉన్న సిగుర్ ఘాట్ ను చూడటానికి వెళ్లారు.అక్కడ ఒక గోడపై విచిత్రమైన భంగిమలో ఒక దోమను రాస్ చూశారు. అప్పటికి ఆ జాతి దోమ గురించి ఎవ్వరికీ తెలియదు. 1896 మేలో రాస్ కు ఒక రోజు సెలవు దొరికింది. దీంతో వెంటనే ఆయన ఊటీ చుట్టూ మలేరియా కేసులు ఉన్న ఏరియాలో పర్యటించారు. మలేరియా కేసుల వివరాలను సేకరించారు. అయితే మళ్ళీ రొనాల్డ్ రాస్ కు షాక్ తగిలింది. ఆయనను అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు. సికింద్రాబాద్ లోనూ దోమలపై రీసెర్చ్ ను కొనసాగించారు. చివరకు 1897లో దోమల లార్వాల నుంచి 20 “గోధుమ” దోమలను రాస్ సక్సెస్ ఫుల్ గా సృష్టించారు.
Also read : Onion Juice: ఉల్లిపాయ రసం జుట్టుకు హానికరమా..? నివేదికలు ఏం చెబుతున్నాయంటే..?
సికింద్రాబాద్ రోగి హుస్సేన్ ఖాన్ పై తొలి రీసెర్చ్
రొనాల్డ్ రాస్ రీసెర్చ్ లో భాగంగా.. సికింద్రాబాద్ లో హుస్సేన్ ఖాన్ అనే మలేరియా రోగికి 8 అణాలు ఇచ్చి, అతడిని 8 ఆడ,మగా దోమలతో(World Mosquito Day) కుట్టించారు. ఆ మలేరియా రోగి రక్తం తాగిన కొన్నాళ్ళ తరువాత కేవలం ఆడ దోమల పేగుల లోపల మలేరియా పరాన్నజీవి ఉన్నట్లు రాస్ కనుగొన్నాడు. అనోఫిలెస్ జాతి ఆడ దోమ మలేరియాకు కారణం అవుతోందని 1897లో ఆగస్టు 20న గుర్తించారు. మరుసటి రోజు (1897 ఆగస్టు 21న) దోమలో పరాన్నజీవి పెరుగుదలను కూడా గమనించారు. ఈ ఆవిష్కరణ వివరాలు 1897లో ఇండియన్ మెడికల్ గెజిట్‌లో పబ్లిష్ అయ్యాయి.