World Humanitarian Day : మనిషిలోని మానవతకు ఒక రోజు.. సెలబ్రేట్ చేసుకోండి

World Humanitarian Day :  "మానవ సేవే మాధవ సేవ".. ఇది పెద్దలు మనకు నేర్పిన హితోక్తి..   ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీని "ప్రపంచ మానవతా దినోత్సవం"గా  జరుపుకుంటారు.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 10:32 AM IST

World Humanitarian Day :  “మానవ సేవే మాధవ సేవ”.. ఇది పెద్దలు మనకు నేర్పిన హితోక్తి..   

ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీని “ప్రపంచ మానవతా దినోత్సవం”గా  జరుపుకుంటారు.

మన భారతీయ మానవతా విలువలకు అద్దం పట్టే  ప్రత్యేక దినోత్సవం ఈరోజు.. 

సేవాభావంతో నిజ జీవితంలో హీరోలుగా మారిన వారికి ఈరోజు అంకితం..   

ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవల కోసం కృషి చేసే వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటారు.. గౌరవించుకుంటారు.. 

Also read : F-16 Fighters To Ukraine : రష్యాతో అమెరికా కోల్డ్ వార్.. ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలు

ప్రపంచ మానవతా దినోత్సవంపై 2008లో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో  స్వీడన్ దేశం ప్రవేశపెట్టింది. 20 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 2003 ఆగస్టు 19న ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఎటాక్ లో ఇరాక్‌లోని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి సెర్గియో వియెరా డి మెల్లో సహా 22 మంది ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ సిబ్బంది మరణించారు. వాస్తవానికి  ఆ తర్వాతే ఆగస్టు 19ని ప్రపంచ మానవతా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది మాత్రం 2008లోనే !!

సెర్గియో వియెరా హ్యాట్సాఫ్.. 

ఉగ్రదాడిలో మృతిచెందిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి సెర్గియో వియెరా డి మెల్లో నేపథ్యంలోకి వెళితే.. ఆయన బ్రెజిల్‌లో జన్మించారు. ప్రపంచ మానవతా దినోత్సవం అధికారిక గుర్తింపు పొందడానికి ఒక ముసాయిదాను రూపొందించడానికి ప్రయత్నించారు. ఉగ్రవాద దాడుల బాధితులకు సహాయం చేయడానికి, ప్రపంచం వారిని మరచిపోకుండా చూసుకోవడానికి 3 దశాబ్దాలకుపైగా అవిశ్రాంతంగా పనిచేశాడు. అందుకే ఇరాక్ లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరిగిన రోజు(2003 ఆగస్టు 19న) ప్రపంచ మానవతా దినోత్సవంగా (World Humanitarian Day) మారింది.

Also read : Good Bye To RC Cards : డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీ కార్డులకు గుడ్ బై.. ఇకపై డిజిటల్ డాక్యుమెంట్స్ 

కరోనా మహమ్మారి సమయంలో..

కరోనా మహమ్మారి సమయంలో ఆకలితో ఉన్న, నిరాశ్రయులైన ప్రజలకు వైద్యులు, నర్సులు, సాధారణ ప్రజలు, దాతలు ఎలా సహాయం చేశారో మనమందరం చూశాము. ఇది గొప్ప మానవత్వానికి ఉదాహరణ. ఇది మాత్రమే కాదు..  ప్రతి సంవత్సరం అనేక దేశాలు వరదలు, భూకంపాలు, అనేక ఇతర విషాదాల బారిన పడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో వారికి సహాయం చేయడానికి మానవతావాదులు మాత్రమే ముందుకు వస్తారు. అటువంటి కష్ట కాలంలో ప్రజల నుంచి ఎలాంటి సహాయం అందినా వరం కంటే తక్కువేం కాదు.. అలాంటి వారి స్ఫూర్తికి ఈ రోజు వందనం.

మీరు కూడా ముందుకు రండి.. 

మీరు కూడా  మీ పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేయొచ్చు. ఇందుకోసం మంచి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నసంక్షోభ  పరిస్థితులపై మీ స్నేహితులు, సహోద్యోగులతో చర్చించండి. మానవ సేవ అనేది ఎనలేని సంతృప్తిని ఇస్తుందని గుర్తుంచుకోండి. వరదలు, కరువు కాటకాలు, ఆరోగ్య సంక్షోభాలు, ఆర్ధిక సంక్షోభాలు, ఆత్మహత్యలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం  సమాజాన్ని కుదిపేస్తున్నాయి.  వీటిలో ఏదో ఒక విషయంలో మీరు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావచ్చు. మీలో దాగిన మానవత్వాన్ని అందరికీ చూపొచ్చు.