National Mathematics Day : ఇవాళ (డిసెంబరు 22) జాతీయ గణిత దినోత్సవం. భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మనం ఏటా డిసెంబరు 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం. శ్రీనివాస రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకుని, 2011 సంవత్సరం డిసెంబర్ 26న మద్రాసు యూనివర్సిటీలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రారంభించారు. నాటి నుంచి మనదేశంలో ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. యువత, విద్యార్థులను గణితంవైపు ఆసక్తి చూపించేలా ప్రోత్సహించడమే ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. ఇవాళ శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు, కెరీర్ విజయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :16 Psyche Asteroid : భూమిపై అందరినీ కుబేరులుగా మార్చే ‘16సైకీ’.. ఎలా ?
- శ్రీనివాస రామానుజన్ 1887 సంవత్సరం డిసెంబరు 22న తమినళనాడులోని ఈరోడ్‌లో జన్మించారు.
- ఆయనకు చిన్నప్పటి నుంచే మ్యాథ్స్‌పై ఆసక్తి ఎక్కువగా ఉండేది.
- మూడో తరగతిలో ఉండగా శ్రీనివాస రామానుజన్(National Mathematics Day) అడిగిన ఒక ప్రశ్న.. ఆయనకు పాఠాలు చెప్పిన గణితం మాస్టారును ఆశ్చర్యపరిచిందట. సున్నాను సున్నాతో భాగిస్తే ఎంత వస్తుందనేది ఆ ప్రశ్న.
- రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగార్ దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు.
- రామానుజన్ పైచదువుల కోసం ఈరోడ్ నుంచి మద్రాసుకు వెళ్లారు. అక్కడ కాలేజీ ఫీజు కట్టలేక అడ్మిషన్ దొరకలేదు. దీంతో తాను సొంతంగా కనిపెట్టిన గణిత సమీకరణాల వివరాలతో అక్కడే ఓ గణిత అధ్యాపకుడి ఎదుట ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారు.
- ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ జీహెచ్ ఆర్డీతో రామానుజన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ వర్సిటీలో ఉన్నప్పుడే ఆయన ఎన్నో గణిత సిద్ధాంతాలను కనిపెట్టారు.
- మ్యాథ్స్‌కు సంబంధించిన నంబర్ థియరీ, ఇన్ఫినిటీ సిరీస్, మోడ్యూలర్ ఫామ్స్, ఫ్రాక్షన్స్ విభాగాలపై రామానుజన్ విశేష కృషి చేశారు.
- మ్యాథ్స్‌లోని పార్టీషియన్ ఫంక్షన్, ప్రైమ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్‌పై రామానుజన్ చేసిన కృషి గణిత శాస్త్రంపై చాలా ప్రభావాన్ని చూపింది.
- నాడు రామానుజన్ రాసుకున్న పుస్తకంలో ఆస్ట్రో ఫిజిక్స్, బ్లాక్ హోల్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు ఉపయోగపడే గణిత సమీకరణాలు ఉన్నాయి.
- క్యాన్సర్ చికిత్స, ఉపగ్రహాలపై పనిచేసే గ్రావిటేషనల్ ఎఫెక్టు వంటి వాటి గురించి తెలుసుకునేందుకు వందేళ్ల క్రితం రామానుజన్ కనిపెట్టిన సమీకరణాలే ఉపయోగపడుతున్నాయని అంటారు.
- 1918లో రాయల్ సొసైటీ ఫెలోగా రామానుజన్ ఎంపికయ్యారు.
- శ్రీనివాస రామానుజన్ జీవించింది కేవలం 32 సంవత్సరాలే. అయినా గణిత శాస్త్రంపై చెరగని ముద్ర వేశారు.