Site icon HashtagU Telugu

International Girl Child Day : ఆ చిరునవ్వులు చెరగనీయొద్దు..

International Girl Child Day

International Girl Child Day

International Girl Child Day : ఆడపిల్ల నవ్వు ఓ పువ్వులా ఇంటికి అందాన్నిస్తుంది. ఆడపిల్ల ఉంటే ఇంట్లో మహాలక్ష్మీ ఉన్నట్టే. చెల్లిలా, తల్లిలా, స్నేహితురాలిలా.. మనకు జీవితాంతం తోడుంటుంది ఆడపిల్ల. మనదేశంలో అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తూ పురోగమిస్తున్నారు. తాజాగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు భారత పార్లమెంటు ఆమోదం తెలపడం హర్షించదగిన పరిణామం. 2012 నుంచి ఏటా అక్టోబర్‌ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతీ ఏటా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఏదో ఒక ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుంటారు. ‘‘బాలికల హక్కుల సాధనకు ప్రయత్నాలు మరింత పెరగాలి. పోరాటాలు మరింత జరగాలి.. మహిళల నాయకత్వంతోనే మహిళల శ్రేయస్సు దిశగా అడుగులు పడతాయి’’ అనేది ఈ ఏడాదికి సంబంధించిన థీమ్.

1995లో చైనా రాజధాని బీజింగ్‌లో..

1995లో చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన భేటీలో మహిళలు, బాలికల హక్కుల కోసం ప్రపంచ దేశాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. బాలికల హక్కుల కోసం ఆమోదం పొందిన మొట్టమొదటి తీర్మానం ఇదే. ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని 2011 డిసెంబర్ 19న ఐక్యరాజ్య సమితి సూచించింది. బాల్యవివాహాలకు ముగింపు పలకాలనే థీమ్‌తో తొలి ఏడాది బాలికల దినోత్సవాన్ని అప్పట్లో జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బాలికలకు హక్కులపై అవగాహన కల్పించడం, లింగ వివక్షను రూపుమాపడం, మహిళా సాధికారత కోసం జరిపే పోరాటాలకు సహకారం అందించడం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలు.

We’re now on WhatsApp. Click to Join

ఇది డిజిటల్‌ యుగం. డిజిటల్ పరికరాల వాడకంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు వెనకంజలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్త అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈనేపథ్యంలో బాలికలకు  డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంపై అవగాహన పెంచాలి. బాల్యం నుంచే బాలికలకు డిజిటల్ పేపర్స్, నాలెడ్జ్ అందించే వెబ్ సైట్స్, చదువుకు సంబంధించిన వెబ్ సైట్స్, సక్సెస్ స్టోరీస్ కు సంబంధించిన వీడియోలను చూపించాలి. తద్వారా వారికి ఓ వైపు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన పెరగడంతో పాటు మరోవైపు మానసికంగా వారి ఆత్మస్థైర్యం స్థాయులు పెరుగుతాయి. మహిళలు కూడా ఏదైనా సాధించగలరు అనే విశ్వాసం బాల్యం నుంచే (International Girl Child Day) కలుగుతుంది. ఇది భవిష్యత్తులో భారీ విజయాలకు బాటలు వేస్తుంది. వెలుగుల భావి భారతాన్ని నిర్మిస్తుంది.

Also read : Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు