Tirupati: మహిళల భద్రత కోసం ‘షీ ఆటోలు’

విద్య, వైద్యం, ఉపాధి కోసం ఎంతోమంది మహిళలు, యువతులు ఇల్లు విడిచి బయటకు వెళ్తుంటారు.

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 03:11 PM IST

విద్య, వైద్యం, ఉపాధి కోసం ఎంతోమంది మహిళలు, యువతులు ఇల్లు విడిచి బయటకు వెళ్తుంటారు. అయితే సరైన రవాణ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తోంది. ఆకయితాల వేధింపుల, పోకిరీల టీజింగ్ కు గురైన సంఘటన చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పోలీసులు షీ ఆటోలను ప్రారంభించారు. మహిళలు, అమ్మాయిలకు సురక్షితమైన రవాణాను అందించడానికి తిరుపతి పోలీసులు శుక్రవారం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మూడు ‘షీ ఆటో’ స్టాండ్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్, మహిళా యూనివర్శిటీ, రుయా ఆస్పత్రి వద్ద ప్రత్యేక ఆటో స్టాండ్‌లను స్థానిక నాయకులు, అధికారులు కలిసి ప్రారంభించారు.

మహిళా ఆటో రిక్షా డ్రైవర్ల భద్రతపై దృష్టి సారించిన ఎస్పీ నాయుడును ఎమ్మెల్యే అభినందించారు. మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడమే షీ ఆటో స్టాండ్‌ల వెనుక లక్ష్యమని ఎస్పీ తెలిపారు. మహిళా ఆటో డ్రైవర్లపై ఒక్క యాక్సిడెంట్ కేసు కూడా నమోదు చేయలేదని, షీ ఆటోను ప్రత్యేకంగా పింక్ కలర్‌లో డిజైన్ చేశామని ఎస్పీ తెలిపారు. రాష్ట్రీయ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ మహిళలకు ఆటో రిక్షాలు నడపడంలో శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో 150 మందికి పైగా మహిళా ఆటో డ్రైవర్లు ఉన్నారు.