KYC – ECI APP : ఈసీ ‘కేవైసీ యాప్’.. ఒక్క క్లిక్‌లో ఎంపీ అభ్యర్థుల సమాచారం

KYC - ECI APP : మీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల సమాచారం కావాలా ?

  • Written By:
  • Updated On - March 23, 2024 / 01:49 PM IST

KYC – ECI APP : మీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల సమాచారం కావాలా ? వాళ్లు ఏం చదువుకున్నారు ? వాళ్లకున్న ఆస్తులేంటి ? వంటి ఆసక్తికర సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? అది చాలా ఈజీ !! మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి KYC – ECI APPను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. KYC అంటే Know Your Candidate. మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి అని దీని అర్థం. Google Play Store లేదా App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. KYC-ECI అని తొలుత సెర్చ్ చేయండి.  ఈ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అనంతరం యాప్‌ను ఓపెన్ చేసి, ‘ప్రొసీడ్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే సెర్చ్ బాక్సులో, మీ అభ్యర్థి పేరును టైప్ చేయాలి. ఆ తర్వాత ‘సెలెక్ట్ క్రైటేరియా’ బాక్సులో నియోజకవర్గానికి ఏ ఓటు, రాష్ట్రం తదితర వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం సబ్మిట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, మీ అభ్యర్థికి సంబంధించిన వివరాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. లోక్‌సభ అభ్యర్థి విద్య, ఆస్తి, నేర చరిత్ర వంటి సమాచారమంతా తెలిసిపోతుంది. మీరు ఈ యాప్‌లో స్థానిక పోలింగ్ బూత్‌లను కూడా వెతకొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఇంటి వద్దే ఓటు వేయాలంటే..

ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేయాలనుకునే వారు ఫారం-డీని నింపి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు గ్రామపంచాయతీ కార్యదర్శి, బూతు లెవల్‌ అధికారి(బీఎల్‌వో) వద్ద అందుబాటులో ఉన్నాయి. దీనికి ఎంపికయ్యే వారి ఇంటికి పోలింగ్‌ సిబ్బంది వచ్చి ఓటింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల వివరాలను ఎన్నికల అధికారులు ఇప్పటికే గుర్తించారు.

Also Read : Gift Of Thar : సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి గిఫ్టుగా థార్.. ఆనంద్ మహీంద్రా గ్రేట్ !

సీ విజిల్‌ యాప్‌

సీ విజిల్‌ యాప్‌ను వినియోగించడం ద్వారా ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రజలు సీ విజిల్‌ యాప్‌ను వాడొచ్చు. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించడం, ప్రత్యర్ధి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం వంటి వివిధ ఉల్లంఘనలపై సీ విజిల్‌ యాప్‌ ద్వారా ప్రజలే నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. సీ విజిల్‌ యాప్‌ను కూడా ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Also Read :Message From Jail : ఢిల్లీ నెక్ట్స్ సీఎం సునీతా కేజ్రీవాల్ ? ఇదేనా సంకేతం ?!