2024 Summer : భూమి మీద ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది. ఇక ఈ 2024 సంవత్సరంలోనూ సమ్మర్ సీజన్ చాలా హాట్‌గానే ఉంటుందని అంటున్నారు. ఈమేరకు ‘వరల్డ్ మెటొరోలాజికల్ ఆర్గనైజేషన్’ (WMO) అంటోంది. దీనిపై ‘ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్’ను ఆ సంస్థ తాజాగా ప్రచురించింది. ‘‘2023 సంవత్సరంలో ఉత్తరార్ధగోళం పరిధిలో వసంతకాలం, వేసవి సీజన్లలో ఎల్ నినో తరహా పరిస్థితులు అలుముకున్నాయి. దీని ఎఫెక్టుతో ఈ ఏడాదిలోనూ టెంపరేచర్స్ పెరిగే ఛాన్స్ ఉంది’’ అని నివేదిక హెచ్చరించింది. “ ప్రస్తుతం వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు రికార్డు స్థాయుల్లో ఉన్నాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయుల్లో నమోదు అవుతున్నాయి. ఫలితంగా సముద్ర మట్టాలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అంటార్కిటిక్ సముద్రంలో మంచు కూడా తగ్గిపోతోంది. ఇవన్నీ ఈ ఏడాది సమ్మర్‌లో ఎండలు దంచికొట్టేందుకు దారితీసే అంశాలే’’ అని ‘వరల్డ్ మెటొరోలాజికల్ ఆర్గనైజేషన్’ రిపోర్టు వివరించింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రత్యేకించి 2023 నవంబరు నుంచి వాతావరణంలో చోటుచేసుకుంటున్న ప్రతికూల మార్పులు ఈ ఏడాది వేసవిని(2024 Summer) మరింత వేడెక్కిస్తాయని WMO అంచనా వేసింది. 2023లో జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఉష్ణోగ్రతలు.. ఒక దాన్ని మించి మరొకటి నమోదయ్యాయి. 1993-2002 సంవత్సరాలతో పోలిస్తే 2013-2022 సంవత్సరాల మధ్యకాలంలో సముద్ర మట్టాలు రెండింతల కంటే ఎక్కువగా పెరిగాయి. ఉత్తర అమెరికా, ఐరోపాలోని హిమానీనదాలు మరోసారి విపరీతంగా కరిగిపోయాయి. ఇవన్నీ ఈ ఏడాది పెరగబోయే ఎండలకు డేంజర్ బెల్సే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Also Read: China vs Taiwan : చైనా బెలూన్స్ చక్కర్లు.. తైవాన్‌లో పోలింగ్.. అధ్యక్షుడు ఎవరో ?
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం అత్యంత శీతల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ శీతాకాల సీజన్ మొత్తంలో శుక్రవారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలికి తోడు రాజధాని నగరంపై దట్టమైన పొగ కమ్మేసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు, రైలు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. కొన్ని ఏరియాల్లో దృశ్యమానత జీరోకు పడిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 23 రైళ్లు గంట నుంచి ఆరుగంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.