Site icon HashtagU Telugu

Real Bigg Boss : భయంగొలిపే ‘బిగ్ బాస్’ గొంతు.. ఈయనదే

Bigg Boss Voice

Bigg Boss Voice

Real Bigg Boss :‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఒక ఎత్తు.. అందులో వినిపించే వాయిస్ ఒక ఎత్తు  !!

ఆ వాయిస్ ఎంతో అట్రాక్టివ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది.. 

ఇంతకీ ఆ గొంతు ఎవరిది ? ఇప్పుడు తెలుసుకుందాం.. 

బిగ్ బాస్ షోలో మనం బిగ్ బాస్ మాటను వింటుండటమే కానీ.. ఆ గంభీరమైన గొంతు ఎవరిదనే విషయంపై పెద్దగా ఎన్నడూ ఫోకస్ పెట్టలేదు. అంతటి డైనమిక్ గొంతును అందించిన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టు పేరు.. రాధాకృష్ణ అలియాస్ రేనుకుంట్ల శంకర్. 2017 సంవత్సరంలో తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో.. ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. ఇందులో సీజన్ వన్ నుంచే తన వాయిస్ తో.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వారిని రాధాకృష్ణ  కంట్రోల్ చేస్తున్నారు. వారికి రకరకాల టాస్క్ లు ఇస్తూ భళా అనిపిస్తున్నారు. బిగ్ బాస్ కంటే ముందు రేనుకుంట్ల శంకర్ అనేక సినిమాలకు, సీరియళ్లకు, ప్రకటనలకు డబ్బింగ్ చెప్పారు. గతంలో తెలుగులో డబ్ అయిన ‘సీఐడీ’ క్రైమ్ థ్రిల్లర్ సీరియల్‍కు కూడా తన గొంతు అందించారు.

Also read : Vietnam: వియత్నాం రాజధాని హనోయిలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి

బిగ్ బాస్ వాయిస్ కోసం శంకర్‍ను అంత ఈజీగా ఎంపిక చేయలేదు. బిగ్ బాస్ షోని తెలుగులో ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టినప్పుడు దాదాపు 100 మంది డబ్బింగ్ ఆర్టిస్టులను పరీక్షించారు. వారందరిలోనూ శంకర్ (Real Bigg Boss) గొంతు బాగుంటుందని ఎంపిక కమిటీ సభ్యులు  డిసైడ్ అయ్యారు.  మొదటి మూడు బిగ్ బాస్ సీజన్లలో ఒక విధమైన గొంతుతో డబ్బింగ్ చెప్పిన శంకర్.. ఆ తర్వాత తన స్వరం మాడ్యులేషన్ ను మార్చుకున్నారు. అప్పటి నుంచి బిగ్ బాస్ కోసం ఆయన డబ్బింగ్ ఒకే విధంగా వినిపిస్తోంది.  ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగులోకి 14 మంది కంటెస్టెంట్స్ రాగా.. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

Exit mobile version