T Trains Coming Soon : స్టీమ్ ఇంజన్ కాని స్టీమ్ ఇంజన్ తో “టీ ట్రైన్స్”.. రాయల్ ఫీచర్స్ తో ఎంట్రీ

T Trains Coming Soon  : పాతకాలపు స్టీమ్ ఇంజన్ ట్రైన్స్ గుర్తున్నాయా ?అవి మళ్ళీ గ్రాండ్ అండ్ రాయల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.. 

Published By: HashtagU Telugu Desk
T Trains Coming Soon

T Trains Coming Soon

T Trains Coming Soon  : పాతకాలపు స్టీమ్ ఇంజన్ ట్రైన్స్ గుర్తున్నాయా ?

అవి మళ్ళీ గ్రాండ్ అండ్ రాయల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.. 

ఎలక్ట్రిక్ ట్రైన్స్.. వందే భారత్ ట్రైన్స్.. బుల్లెట్ ట్రైన్స్ హల్ చల్ చేస్తున్న ఈ టైంలో మళ్ళీ  స్టీమ్ ఇంజన్ ట్రైన్స్ ఎందుకు ? అని ఆలోచిస్తున్నారా !!

అయితే ఈ స్టోరీ చదవండి.. 

రైల్వేను టూరిజం వెహికల్ గా డెవలప్ చేయడంపై రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది.  ఇందులో భాగంగా రాయల్, లగ్జరీ, క్లాసిక్ రకాల కొత్త కొత్త  రైళ్లను టూరిస్ట్ స్పాట్ లలో ఇంట్రడ్యూస్ చేస్తోంది.  ఈక్రమంలోనే రైల్వే శాఖ క్రియేటివ్ గా ఆలోచించింది.  పాత తరం స్టీమ్ ఇంజన్లతో కొత్త రైళ్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఆ ఇంజన్ చూడటానికి స్టీమ్ ఇంజన్ లా ఉంటుంది. కానీ అది కూడా ఎలక్ట్రిక్ ఇంజనే !!  ఈవిధంగా స్టీమ్ ఇంజన్ లుక్ లో కనిపించే ఎలక్ట్రిక్ రైలు ఇంజన్ ను దక్షిణ రైల్వే పరిధిలోని పెరంబూర్ క్యారేజ్ అండ్  వ్యాగన్ వర్క్స్, ఆవడి ఈఎంయూ కార్ షెడ్, తిరుచ్చి గోల్డెన్ రాక్ వర్క్‌షాప్‌లు సంయుక్తంగా తయారు చేశాయి. 1895లో దేశంలో తొలిసారి నిర్మించిన స్టీమ్ ఇంజన్  F734 మోడల్ లో ఈ సరికొత్త ఇంజన్ ను చూడచక్కగా డిజైన్ చేశారు. ఈ ఇంజన్ కు ఇప్పటికే సేఫ్టీ సర్టిఫికెట్ లభించింది. ఇందులో ఇద్దరు లోకోలు కూర్చునేందుకు (డ్రైవర్లు) ఏర్పాట్లు ఉంటాయి.. దీన్ని చూడగానే మనకు ఆనాటి స్టీమ్ ఇంజన్ కచ్చితంగా గుర్తుకొస్తుంది.

Also read : Two Indian Army: నదిలో కొట్టుకుపోయిన ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు

ఈ ఇంజన్ తో కూడిన తొలి రైలుకు “T ట్రైన్” అని పేరు పెడతారని తెలుస్తోంది. ఈ రైలులో 4 ఏసీ విస్టాడోమ్ కోచ్‌లు ఉంటాయి. వీటిలోనే ఒకటి AC రెస్టారెంట్ కార్‌గా ఉంటుంది. ఇందులోకి వెళ్లి భోజనాలు చేయొచ్చు. ఒకేసారి 28 మంది కూర్చొని ఫుడ్ తినొచ్చు. ఒక్కో బోగీలో 48 సీట్లు ఉంటాయి. బోగీల లోపల అందమైన ఇంటీరియర్స్, గోడలకు అట్రాక్టివ్ పెయింటింగ్స్, థీమ్ ఆధారిత వినైల్ ర్యాపింగ్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వందే భారత్ తరహాలో “T ట్రైన్”లోనూ ప్రయాణికులు కూర్చోవడానికి డబుల్ సీటెడ్ రిక్లైనింగ్ మెకానిజమ్‌ ఉంటుంది. ప్రతి ప్రయాణీకునికి ఒక్కో ప్రత్యేక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ బోగీల అద్దాలు పగలకుండా నిరోధించడానికి.. గాజులో ఒక రక్షిత పొరను జోడించారు. ప్రతి కోచ్‌లో మినీ ప్యాంట్రీ పరికరాలతో పాటు ఎలక్ట్రికల్‌ ఎనర్జీ తో పనిచేసే ఆటోమేటిక్ కంపార్ట్‌మెంట్ స్లైడింగ్ డోర్లు ఉంటాయి. ఈ రైలును ప్రస్తుతం  చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ప్రదర్శన కోసం ఉంచారు. త్వరలోనే దీనితో కొన్ని టూరిస్టు స్పాట్ ల మధ్య ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత  విడతల వారీగా మరిన్ని “T ట్రైన్”లను(T Trains Coming Soon) అందుబాటులోకి తెస్తారు.

  Last Updated: 09 Jul 2023, 11:47 AM IST