Hezbollah Vs Israel : గాజాపై ఇజ్రాయెల్ ఇలాగే దాడులను కొనసాగిస్తే.. తాము యుద్ధ రంగంలోకి దూకక తప్పదని లెబనాన్ లోని షియా మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ప్రకటించింది. సరైన సమయం వచ్చినప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో హమాస్‌తో చేరడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఇంతకీ ఏమిటీ హిజ్బుల్లా ? దాని ఆయుధ బలం ఎంత ? లెబనాన్ లో అది ఎందుకు యాక్టివిటీ చేస్తోంది ? ఇరాన్ .. హిజ్బుల్లాకు ఎందుకు సపోర్ట్ చేస్తోంది ? ఇప్పుడు తెలుసుకుందాం..
1975-1990 లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో..
హిజ్బుల్లా అనేది లెబనాన్ యొక్క 1975-1990 అంతర్యుద్ధం సమయంలో ఏర్పడిన రహస్య మిలిటెంట్ గ్రూప్. ఇజ్రాయెల్ బారి నుంచి లెబనాన్ ను కాపాడేందుకు 1982లో హిజ్బుల్లాను స్థాపించారు. హిజ్బుల్లా అనే పదానికి అర్థం.. ‘‘అల్లాహ్ తరఫు పక్షం’’ లేదా ‘‘దేవుని పక్షం’’. ఈ గ్రూపునకు లెబనీస్ షియా ముస్లింల మద్దతు ఉంది. లెబనీస్ షియా ఇస్లామిస్ట్ రాజకీయ పార్టీగా హిజ్బుల్లాకు పేరుంది. అమెరికా సహా చాలా దేశాలు దీన్ని తీవ్రవాద గ్రూపుగా ప్రకటించాయి. తొలుత ఇది 1,500 మందితో ఏర్పాటైంది. హిజ్బుల్లాకు 1992 నుంచి హసన్ నస్రల్లా నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ పారామిలిటరీ విభాగాన్ని జిహాద్ కౌన్సిల్ అని పిలుస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
హిజ్బుల్లా ఆయుధాలు
- హిజ్బుల్లా దగ్గర దాదాపు 1.50 లక్షల రాకెట్లు ఉన్నాయని అంచనా. ఈ రాకెట్లలో చాలావరకు చిన్నవే. అంటే స్వల్ప శ్రేణి లక్ష్యాలనే అవి ఛేదిస్తాయి.
- స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు కూడా హిజ్బుల్లా వద్ద ఉన్నాయి. ఇవి 1,000 కిలోమీటర్లలోని దూరలోని లక్ష్యాలను ఛేదించగలవు.
- హిజ్బుల్లా చేతిలో M-600, ఫతే-110 మిస్సైల్స్ కూడా ఉన్నాయి.
- ఇరాన్ అందించిన C-802 క్షిపణి హిజ్బుల్లా మిలిటెంట్ల వద్ద ఉంది. 75 మైళ్ల దూరంలోని టార్గెట్లను ఇది ఛేదించగలదు. ఇది 364 పౌండ్ల వార్‌హెడ్‌లన మోసుకెళ్లగలదు.
- చిన్నపాటి డ్రోన్‌లు కూడా 2014 నుంచే హిజ్బుల్లా దగ్గర (Hezbollah Vs Israel) ఉన్నాయి.
Also Read: Gold Medal To Indian Army : ఇండియా ఆర్మీకి గోల్డ్ మెడల్.. ‘కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్’ అంటే ?