Miracle: క్రికెట్‌లో ఇది మహా అద్భుతమే.. అత్యంత చెత్త బంతికి ఔట్..

ఇండియాలోనే కాదు.. చాలా దేశాల్లో క్రికెట్‌ను చాలామంది ఇష్టపడతారు. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. క్రికెట్‌కు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. క్రికెట్‌ను ఆడేందుకు, టీవీల్లో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 30, 2023 / 08:58 PM IST

Miracle: ఇండియాలోనే కాదు.. చాలా దేశాల్లో క్రికెట్‌ను చాలామంది ఇష్టపడతారు. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. క్రికెట్‌కు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. క్రికెట్‌ను ఆడేందుకు, టీవీల్లో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎంతోమంది కొత్త క్రికెటర్లు తమ టాలెంట్‌తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నారు.

అయితే మంచి రికార్డులతో పాటు చెత్త రికార్డులు చాలా ఉంటాయి. తాజాగా క్రికెట్‌లో ఒక చెత్త రికార్డు చోటుచేసుకుంది. అత్యంత చెత్త బాల్‌కు వికెట్ పడింది. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇదేనంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తోన్నాయి. నాలుగేళ్ల క్రిందట నేషనల్ టీ 20 కప్ సందర్భంగా పాకిస్తాన్ బౌలర్ మహమ్మద్ ఇలియాస్ వేసిన ఒక చెత్త బంతికి బ్యాట్స్‌మెన్ జియాస్ అబ్బాస్ ఔట్ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ ఈ వీడియోపై స్పందించాడు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి చెత్త బంతికి వికెట్ రావడం అద్భుతమంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అబ్బాస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్ లెగ్ సైడ్ లో భారీ వైడ్ వేస్తాడు. అయితే అబ్బాస్ వైడ్ బాల్‌ను కూడా వదిలిపెట్టకుండా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నాలు చేస్తాడు. అయితే బాల్ బ్యాట్‌కు తగిలి కీపర్ చేతికి క్యాచ్ ఇస్తాడు. దీంతో ఈ వీడియో తెగ నవ్వు తెప్పిస్తుంది. వీడు దేవుడు స్వామి.. మరీ ఇంత చెత్త బంతికి ఎలా ఔటయ్యాడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి క్రికెటర్లు ఉంటే క్రికెట్ మరింత దిగజారిపోతుందంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా నాలుగేళ్ల క్రిందటి వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.