Comet: నక్షత్రాల కంటే మరింత ప్రకాశవంతంగా నింగిలో ఈ తోకచుక్క దర్శనం

ఓ తోకచుక్క వినీలాకాశంలో ఎంతో ప్రకాశవంతంగా మెరవనుంది. ఇది భూమికి సమీపం నుండి వెళ్లనుంది. సీ/2023ఏ3 పేరుతో పిలుస్తున్న ఈ తోకచుక్క గంటకు 1,80,610 మైళ్ల వేగంతో

ఓ తోకచుక్క (Comet) వినీలాకాశంలో ఎంతో ప్రకాశవంతంగా మెరవనుంది. ఇది భూమికి సమీపం నుండి వెళ్లనుంది. సీ/2023ఏ3 పేరుతో పిలుస్తున్న ఈ తోకచుక్క గంటకు 1,80,610 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకువస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ తోకచుక్క (Comet) చివరిగా 80 వేల ఏళ్ల క్రితం భూమికి సమీపం నుంచి వెళ్లింది. తిరిగి 2024 అక్టోబర్ నెలలో కనిపించనుంది. కంటితో నేరుగా ఈ తోకచుక్కను వీక్షించొచ్చు. గత నెలలో భూమికి సమీపం నుంచి జెడ్ టీఎఫ్ గ్రీన్ తోకచుక్క కూడా వెళ్లింది. దీని మాదిరే సీ/2023ఏ3 తోకచుక్క కనిపించనుంది. సాధారణ నక్షత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ప్రకాశంతో ఇవి ఉంటాయి. వీనస్ మాదిరి (శుక్రుడు) ప్రకాశవంతంగా ఇది ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా.

జెడ్ టీఎఫ్ తోకచుక్క (Comet) ప్లస్ 4.6 మాగ్నిట్యూడ్ వెలుగుతో ఉంటే, దీనికంటే సీ/2023ఏ3 తోకచుక్క 100 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ ఇవన్నీ అంచనాలేనని, భూమిని సమీపించే కొద్దీ ఈ తోకచుక్క ఎన్నో మార్పులకు గురికావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Also Read:  HUID: ఏప్రిల్ 1 విడుదల.. HUID హాల్ మార్క్ గోల్డ్ మాత్రమే విక్రయిస్తారు.. మీరు కొన్న జ్యువెలరీ సంగతేంటి?