Instagram Shopping : ఇన్‌స్టా‌గ్రామ్‌లో షాపింగ్ చేస్తున్నారా.. ఇవి గుర్తుంచుకోండి

Instagram Shopping : ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ ఏ రేంజ్‌లో జరుగుతోందో మనందరికీ తెలుసు.

  • Written By:
  • Updated On - January 6, 2024 / 10:06 AM IST

Instagram Shopping : ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ ఏ రేంజ్‌లో జరుగుతోందో మనందరికీ తెలుసు. చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఈ దిశగా నెటిజన్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నాయి.  నేరుగా తమ సైట్ల నుంచి షాపింగ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఈ జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా షాపింగ్‌ అనేది కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ప్రత్యేకించి  ఇన్‌స్టాగ్రామ్ షాపింగ్ చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

అకౌంట్‌ను చెక్ చేయండి

వేలాది వెబ్‌సైట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌‌లోని తమ ఖాతాల ద్వారా ఆన్‌లైన్ సేల్స్ చేస్తుంటాయి. దుస్తులతో పాటు రకరకాల ఉత్పత్తులను అక్కడ అమ్ముతుంటారు. ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి దుస్తులు లేదా ఉత్పత్తులను కొనాలని భావిస్తే.. ముందుగా ఆ అకౌంటును క్షుణ్నగా చెక్ చేయండి. ఆ అకౌంట్ ఎప్పటి నుంచి ఉందో తెలుసుకోండి. వారి ప్రోడక్ట్స్ కింద నెటిజన్స్ నుంచి వచ్చిన కామెంట్స్, రివ్యూస్ చదవండి. నెగెటివ్ రివ్యూస్ ఎక్కువగా ఉంటే ఆర్డర్ పెట్టకండి. పాజిటివ్ రివ్యూస్ ఎక్కువ ఉన్నా.. ప్రోడక్ట్ క్వాలిటీ, కస్టమర్ కేర్ వివరాల ఆధారంగా ఆచితూచి నిర్ణయం(Instagram Shopping) తీసుకోండి.

సైజు.. ముఖ్యం

దుస్తులు కొనేటప్పుడు ప్రతి బ్రాండ్‌లో సైజులు భిన్న విభిన్నంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. నడుము, ఛాతీ, తొడల విషయంలో సరైన సైజును ఎంపిక చేయాలి. ప్రాంతాన్ని బట్టి సైజ్ చార్ట్ కూడా మారిపోతుంది. అందుకే యూకే లేదా యూఎస్ సైజు చార్టులు పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో దుస్తులు కొనడం బెటర్. ఎందుకంటే ఈ రెండు సైజు చార్టుల్లో తేడా చాలా తక్కువగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చీరలు, చుడీదార్లు, పిల్లల దుస్తులు, జడ క్లిప్పులు, ఆర్టిఫిషియల్ జువెలరీ కూడా సేల్ చేస్తుంటారు.

రిటర్న్ పాలసీ

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్ ఇచ్చే ముందు.. తప్పనిసరిగా చూడాల్సింది రిటర్న్ పాలసీ. ఒకవేళ ప్రోడక్ట్ బాగా లేకున్నా.. మనం అనుకున్న విధంగా లేకున్నా.. వాపస్ ఇచ్చే వెసులుబాటు ఉండాలి. రిటర్న్ తీసుకునే పాలసీ ఉన్న వాళ్ల నుంచే ప్రోడక్ట్ కొంటే బెస్ట్. రిటర్న్ పాలసీ లేని వారికి దూరంగా ఉంటే మంచిది.

Also Read: American Cricket Team : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా కెప్టెన్ మనోడే.. మోనాంక్ కెరీర్ గ్రాఫ్ ఇదిగో

క్యాష్ ఆన్ డెలివరీ

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైనా ప్రోడక్ట్స్ కోసం ఆర్డర్ ఇచ్చేందుకు.. ఆన్‌లైన్ పేమెంట్స్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తున్నది ఒక ఫేక్ వెబ్ సైట్‌కు అయి ఉంటే ఆ డబ్బులన్నీ అటే పోతాయి. ప్రోడక్ట్ మాత్రం రాదు. ఆర్డర్ సెక్షన్‌లో క్యాష్ ఆన్ డెలివరీని ఎంపిక చేసుకోవడం బెటర్. దీనివల్ల ప్రోడక్ట్ చేతికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వొచ్చు. ఫలితంగా మనం మోసపోయే ఛాన్స్‌లు తగ్గుతాయి.