Office Desk : మనం కూర్చొని పని చేసుకునే డెస్క్‌ను చక్కగా మెయింటైన్ చేయాలి. ఆ ప్రదేశం శుభ్రంగా, చూడచక్కగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వీలైతే వాస్తుపరంగా అక్కడ అన్ని పరికరాలు, ఉపకరణాల ప్లేస్‌మెంట్స్ చేయాలి. దీనివల్ల నెగెటివిటీ దరిచేరదు. ప్రత్యేకించి తలుపు వైపుగా వీపు చేసి కూర్చోకూడదు. ఇది మీ పనిని నెగెటివ్‌గా ప్రభావితం చేస్తుంది. పని చేసుకునే డెస్క్(Office Desk) ఎంత నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటే.. అంతగా పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. దీనివల్ల మీ పని లక్ష్యాలను త్వరగా సాధించగలుగుతారు.
We’re now on WhatsApp. Click to Join
డెస్క్‌పై ఇవి ఉంచండి..
- లాప్ టాప్, దాని ఛార్జర్ టేబుల్‌పై పెట్టి ఉంచుకోవద్దని వాస్తు పండితులు అంటున్నారు.
- మన డెస్క్ టేబుల్ వెనుక తప్పకుండా గోడ ఉండేలా చూడాలని చెబుతున్నారు.
- వర్క్ చేసే టేబుల్ ను డైనింగ్ టేబుల్ గా, కిచెన్ టేబుల్ గా మార్చకూడదు.
- లక్కీ బాంబూ(Lucky Bamboo) మొక్కను పనిచేసుకునే టేబుల్‌పై ఉంచుకోవచ్చు.
- డెస్క్ మీద ఎడమ వైపున ఒక గడియారాన్ని పెట్టుకోవాలి.
Also Read :Prompt Engineers : ‘ప్రాంప్ట్’ ఇంజినీర్లకు డిమాండ్.. భారీగా శాలరీ ప్యాకేజీలు
- కుబేర విగ్రహాన్ని పనిచేసే డెస్క్‌పై పెట్టుకోవచ్చు. ఇది ఇత్తడి విగ్రహం అయితే బెటర్. ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది.
- డెస్క్‌పై కుడి వైపున గ్లోబ్ పెట్టుకోవచ్చు.
Also Read :T Shirt : ‘టీ – షర్ట్’ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?
- ఉద్యోగులుగా మనం ఒక పని టార్గెట్‌ను పెట్టుకుంటే.. దానికి కావాల్సిన సంకేతాలు వెంటనే మైండుకు వెళ్తాయి. మనం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నామా ? నెగెటివ్‌గా ఆలోచిస్తున్నామా ? అనే దాని ఆధారంగా ఆ టార్గెట్‌కు సంబంధించిన టాలెంట్ మనకు ఉందా లేదా అనేది మైండ్ నిర్ధారిస్తుంది.
- ఒకవేళ సంబంధిత ట్యాలెంట్ మనకు లేదనే నిర్ధారణకు మైండ్ వస్తే.. మనకు ఆ లక్ష్యంపై ఆసక్తి లేకుండా చేస్తుంది. బద్ధకం ఆవరిస్తుంది.
- ఏదైనా పనిని చేయలేక మధ్యలోనే మానేసి..సాకులు చెప్పే వాళ్లలో తొంభైశాతం మంది ఇలాంటి వాళ్లే ఉంటారు.
- లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే.. దాన్ని సాధించే దిశగా మెదడు మనల్ని సమాయత్తం చేస్తుంది.