Business Ideas : చదువు అవసరం లేదు..తెలివి ఉంటే చాలు..ఈ వ్యాపారాలతో కోట్లు సంపాదించవచ్చు..!!

  • Written By:
  • Updated On - November 22, 2022 / 11:40 AM IST

మనదేశంలో విద్యావంతులకు కొదవలేదు. అయితే కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు..ప్రతిభావంతులపై ప్రభావం చూపిస్తున్నాయి. చదువుకోవాలన్న కోరిక ఉన్నా…ముందుకు సాగలేని పరిస్థితి. చదువు మధ్యలోనే ఆపేసినవారు కూడా కోట్లలో సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడానికి చదువే ఉండాల్సిన పనిలేదు. కష్టపడాల్సినతత్వం తెలివితేటలు ఉంటేచాలు. అలాంటి వారి కోసం మేము 5 బిజినెస్ ఐడియాలను మీ ముందు ఉంచుతున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం ఐడియా మీకోసం.

తాగునీటి సరఫరా..!!
ఈ రోజుల్లో కాలుష్యం పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. భూమిలో నుంచి డైరెక్టుగా వచ్చే నీటిని తాగేందుకు ఇష్టపడటం లేదు. ప్రతిఒక్కరూ మినరల్ వాటర్ తాగేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ మినరల్ వాటర్ లేదా ఆర్ఓ వాటర్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం పెద్ద నగరాల్లోనే కాదు మారుమూల గ్రామాల్లో సైతం ఊపందుకుంది. పెళ్లిళ్లు, పార్టీలు, ఫంక్షన్లు ఇలా డబ్బాల్లో నీటిని తాగేందుకు ఇష్టపడుతున్నారు. 20లీటర్ల వాటర్ క్యాన్లకు సరఫరాల చేస్తే 40శాతం లాభం పొందవచ్చు. దీనికి ఎలాంటి విద్యార్హత అవసరం లేదు.

టులెట్ సర్వీస్!!
భూమి, ఇల్లు, దుకాణం, ఫ్లాట్ వీటికి సంబంధించిన సమాచారం అందించడానికి ఈ టులెట్ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఒక వ్యక్తికి పూర్తి సమాచారాన్ని అందివచ్చు. ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నా..అద్దెకు తీసుకోవాలన్నా…టులెట్ సర్వీస్ ను సంప్రదిస్తారు. ఈ సర్వీసును మీరు ప్రారంభించినట్లయితే రెండు వైపుల నుంచి సంపాదించవచ్చు. అందుకు కొనుగోలుదారుడు, విక్రయదారుడిని నుంచి రెండు వైపు కమిషన్ వస్తుంది. 5లక్షల ఆస్తిని కొనుగోలు చేస్తే…మీకు అందులో నుంచి 2శాతం కమిషన్ వస్తుంది. ఆస్తి విక్రయించిన వ్యక్తి నుంచి కూడా 2శాతం కమిషన్ వస్తుంది. ఇలా మొత్తం మీరు 4శాతం కమిషన్ పొందవచ్చు.

టూర్ అండ్ ట్రావెల్స్ !!
ఎక్కడికైనా వెళ్లాలంటే రైళ్లలోనో, బస్సుల్లోనో టికెట్లు దొరక్కుండా కిక్కిరిసిన జనాలా మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అలాంటి సాహాసాలు చేయకుండా హాయిగా ప్రయాణం చేయాలనుకుంటారు. దీని కోసం, ట్రావెల్ ఏజెన్సీని సంప్రదిస్తారు. మీరు మీ స్వంత ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభిస్తే, అది మీకు చాలా అధిక ఆదాయ వ్యాపారంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు మంచి కమీషన్ వస్తుంది. టాక్సీని బుక్ చేసుకుంటే టాక్సీ యజమాని నుండి కమీషన్ తీసుకోవచ్చు. మీరు కస్టమర్‌లకు మంచి సేవలను అందిస్తే.. అప్పుడే మీ వ్యాపారం పురోగమిస్తుంది.

పాడి పరిశ్రమ!!
దేశంలో పాడి పరిశ్రమకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య చాలామంది ఈ వ్యాపారం చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ పరిశ్రమకు డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. నగరం నుండి గ్రామం వరకు ప్రతిచోటా పాడి పరిశ్రమ వ్యాపారం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు విద్యావంతులు కావాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారం వల్ల చాలా లాభాలు పొందవచ్చు. ఆవులు గేదెలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ప్రభుత్వం కూడా సబ్సిడీ రూపంలో ఆర్థిక సాయం అందిస్తుంది.

రెడీమేడ్ గార్మెంట్స్ షాప్!!
ఈరోజుల్లో చిన్న వేడుకలైనా, పెద్ద వేడుకలైనా అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఈ రోజుల్లో రెడీమేడ్ వస్త్రాల విక్రయాలు బాగా పెరిగిపోయాయి. మీకు సమీపంలోని రెడీమేడ్ గార్మెంట్స్ దుకాణాన్ని తెరవడం ద్వారా మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు . మీకు ఫ్యాషన్, ట్రెండ్‌లపై మంచి అవగాహన ఉంటే, ఎటువంటి విద్యార్హత లేకపోయినా, మీరు దానిని సులభంగా ప్రారంభించవచ్చు.