Popular Father Characters : ‘ఆ నలుగురు’.. తండ్రి పాత్రల్లో వారికి వారే సాటి!

'ఫాదర్స్‌ డే' నేడే (జూన్ 16). నాన్న అంటే ఒక రియల్ హీరో. నాన్న అంటే ఒక లెజెండ్. నాన్న అంటే ఒక ఆదర్శం.

  • Written By:
  • Updated On - June 16, 2024 / 08:13 AM IST

Popular Father Characters : ‘ఫాదర్స్‌ డే’ నేడే (జూన్ 16). నాన్న అంటే ఒక రియల్ హీరో. నాన్న అంటే ఒక లెజెండ్. నాన్న అంటే ఒక ఆదర్శం. నాన్న అంటే త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. ఇటువంటి నాన్నలకు అంకితం ఈ రోజు. ఔనన్నా కాదన్నా మనపై సినిమాల ప్రభావం చాలానే ఉంటుంది. సినిమాల్లోని తండ్రి పాత్రల ప్రభావం కూడా సినీ ప్రియులపై ఎక్కువే ఉంటుంది. టాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతంగా తండ్రి పాత్రలను(Popular Father Characters) పోషించిన ప్రముఖ నటుల గురించి ఫాదర్స్ డే సందర్భంగా తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ప్రకాష్ రాజ్: ప్రకాష్‌ రాజ్‌ యాక్షన్ సూపర్‌గా ఉంటుంది. సినిమాల్లో ఆయన రకరకాల పాత్రలు పోషించినప్పటికీ ప్రజలకు ఎమోషనల్‌గా దగ్గరైనవి మాత్రం తండ్రి పాత్రలే. కొన్ని సినిమాల్లో కొడుకును కంట్రోల్‌లో పెట్టి తండ్రిగా.. ఇంకొన్ని సినిమాల్లో తన కూతురు ఫ్యూచర్ గురించే నిత్యం ఆరాటపడే తండ్రిగా ఆయన నటన అమోఘం, అద్భుతం. తండ్రిని సమాజం ఎలా చూస్తుంది ? తండ్రులు తమ పిల్లల బాగు గురించి ఎలా ఆలోచిస్తుంటారు ?  అనేది ఆయన తండ్రి పాత్ర పోషించిన మూవీస్‌ను చూస్తే అర్థమవతుంది. నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, బొమ్మరిల్లు సినిమాల్లో ప్రకాష్ రాజ్ పోషించిన తండ్రి పాత్రలు అదుర్స్. దిల్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాల్లోనూ ఆయన తండ్రి పాత్రనే పోషించారు.

జగపతి బాబు: టాలీవుడ్‌ మూవీస్‌లో తండ్రి క్యారెక్టర్‌కు బాగా సరిపోయే మరో గొప్ప నటుడు జగపతి బాబు. శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు పోషించిన పాత్రకు ఆయన తండ్రిగా నటించారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా జీవించిన ఓ తండ్రిని అద్దంపట్టేలా  ఆయన కనిపించారు. కుమారుడి కోసం ఆస్తులు కూడబెట్టి.. సొంతూరిని, తనకు సహాయం చేసిన వాళ్లను మర్చిపోయిన తండ్రి పాత్ర శ్రీమంతుడు మూవీలో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. తండ్రులకు కూడా వారివారి జీవితాల్లో వివిధ నేపథ్య గాథలు ఉంటాయని ఈ మూవీ చాటి చెప్పింది. రారండోయ్ వేడుక చూద్దాం మూవీలోనూ ఆయన తండ్రి పాత్రతో ఆకట్టుకున్నారు.

రావు రమేశ్:  ఒకప్పటి తెలుగు సినిమాల్లో విలన్ రావు గోపాలరావు అందరికీ తెలుసు. ఆయన కొడుకే రావు రమేశ్. ఆయన తండ్రి పాత్రలో అదుర్స్ అనిపిస్తున్నారు. ఓ మాటలో చెప్పాలంటే ఆ పాత్రల్లో రావు రమేశ్ జీవిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హీరోయిన్ (సమంత) తండ్రిగా ఆయన నటన అందరి మన్ననలు అందుకుంది. కొంచెం అహంకారం.. కొంచెం ప్రేమలను కలగలిపి ఆ మూవీలో తండ్రి పాత్రలో రావు రమేశ్ నటించిన తీరు బాగుంది. ఆర్‌ఎక్స్‌ 100, అత్తారింటికి దారేది సినిమాల్లోనూ తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్:  సామాజిక హితం, ప్రజలతో కనెక్టివిటీ కలిగిన కథలున్న సినిమాల్లో నటిస్తూ రాజేంద్ర ప్రసాద్ టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేస్తున్నారు. గతంలో ఆయన సినిమాల్లో హీరో పాత్ర పోషించి.. సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించేవారు. ఇప్పుడు తండ్రి పాత్రల్లో నటిస్తూ ఎమోషన్‌ను పండిస్తున్నారు. ఆ నలుగురు మూవీలో తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటన సూపర్. నాన్నకు ప్రేమతో సినిమాలో హీరో (జూనియర్ ఎన్టీఆర్) పాత్రకు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటన లెజెండరీగా ఉంటుంది. వీటితో పాటు మహానటి, కౌసల్య కృష్ణమూర్తి, సుప్రీమ్, ఈడో రకం ఆడో రకం వంటి సినిమాల్లోనూ ఆయన తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు.

Also Read :Father’s Day 2024: ఫాదర్స్ డే వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటి..?