Site icon HashtagU Telugu

Animals with Talent : తెలివితేటలు ఎక్కువగా ఉన్న జంతువులు ఏవో తెలుసా?

These Animals and Birds have Good Talent like Humans

These Animals and Birds have Good Talent like Humans

మనుషులతో సమానంగా బుద్ధికుశలత ఏ జంతువుకు ఉండదు. కానీ కొన్ని జంతువులకు(Animals), పక్షులకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.

ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్(Parrots) ఇవి మనం ఏ విధంగా మాట్లాడతామో ఆ మాటలను మాట్లాడతాయి. వాటికి చిన్న చిన్న సమస్యలను పరిష్కారం జరపగల సామర్ధ్యం ఉంది.

పిల్లులకు(Cats) కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కుక్కల కంటే బాగా పనిచేస్తాయి.

చింపాంజీలు(Chimpanzee) తమను అద్దంలో చూసుకుంటే గుర్తుపడతాయి. ఇంకా అవి సైగల భాషను అర్ధం చేసుకోగలుగుతాయి.

కాకి(Crow) చాలా తెలివైనది అవి తమ పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్పిస్తాయి. కాకులు తమ ఆహారాన్ని దాచుకోవాలి అనుకుంటే అవి చాలా తెలివిగా దాచుకుంటాయి.

కుక్కలు(Dogs) చాలా పదాలను గుర్తుంచుకోగలవు. ఇంకా అవి మనుసులు ఏమి ఆలోచిస్తున్నారో కూడా తెలుసుకోగలవు. మనుషులు చెప్పినట్టు వింటాయి.

డాల్ఫిన్(Dolphins) లు కొత్త విషయాలను నేర్చుకోవడం, మిమిక్రీ చేయడం చేస్తుంటాయి. ఇవి చాలా సమస్యలను పరిష్కరించగలవు.

ఏనుగులకు(Elephants) తెలివితేటలు ఎక్కువ ఎందుకంటే అవి తమ ప్రయాణ మార్గాన్ని గుర్తుపెట్టుకుంటాయి. వాసన మరియు శబ్దాల ద్వారా అన్నింటిని తెలుసుకుంటాయి.

గుంపులుగా ఉండే గుర్రాలు తమ బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడుకుంటాయి.

ఆక్టోపస్ ను మనం దేనిలో బంధించినా తేలికగా తప్పించుకునే తెలివితేటలు ఉన్నాయి. ఈ విధంగా ఒక్కో రకమైన జంతువుకి ఒక్కో రకమైన తెలివితేటలు ఉంటాయి. కానీ పైన చెప్పిన జంతువులు మనుషులకు సమానంగా తెలివితేటలు ఉండి మనతో తొందరగా కలిసిపోతాయి.