X mark : వందే భారత్‌ ట్రైన్స్ చివరి బోగీలపై X గుర్తు ఎందుకు లేదు ?

X mark : ప్రతి రైలు చివరి కంపార్ట్‌మెంట్‌పై X గుర్తు ఉంటుంది.. అయితే అది వందే భారత్‌ ట్రైన్స్  చివరి కోచ్ లపై ఎందుకు లేదు ?

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 08:17 AM IST

X mark : ప్రతి రైలు చివరి కంపార్ట్‌మెంట్‌పై X గుర్తు ఉంటుంది..

అయితే అది వందే భారత్‌ ట్రైన్స్  చివరి బోగీలపై ఎందుకు లేదు ?

అనే డౌట్ చాలామందికి వస్తోంది .. 

X గుర్తు అనేది.. రైలు యొక్క చివరి కోచ్ ను సూచిస్తుంది.

వందే భారత్ రైలు రెండు దిక్కులలోనూ (ముందుకు, వెనక్కు) నడవగలదు.

అందుకే దీని చివరి బోగీపై X మార్క్ ఉండదు. 

రైల్వేలలో ఇంకా ఎన్నో గుర్తులను నిత్యం ఉపయోగిస్తారు. వీటిలో X గుర్తు (X mark) చాలా ముఖ్యమైంది. వందే భారత్ ట్రైన్ కాకుండా.. ఇతర ట్రైన్స్ లో చివరి బోగీపై X మార్క్ లేకపోతే దాని వెనుక భాగంలోని కొన్ని బోగీలు విడిపోయినట్టుగా గుర్తిస్తారు. రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి, ఈ రైలు వెనుక భాగంలో ఉన్న కొన్ని బోగీలు విడిపోయి వెనుక ఎక్కడో ఉండిపోయాయని సమాచారం అందిస్తారు. అందువల్ల..ఇతర సాధారణ రైళ్ల చివరి బోగీపై X గుర్తు ఉండటం  చాలా ముఖ్యం.

Also read : CM Jagan : ఈ నెల 21 న “నేత‌న్న నేస్తం” .. వెంక‌ట‌గిరిలో ప్రారంభించ‌నున్న సీఎం జ‌గ‌న్‌

వందే భారత్ రైలు ప్రత్యేకతలు

  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు ఉన్నాయి.
  • ప్రతి డోర్ వెలుపల ఆటోమేటిక్ ఫుట్‌ రెస్ట్‌లు కూడా ఉన్నాయి.
  • స్టేషన్‌లో ఈ గేటు ఆటోమేటిక్‌గా తెరుచుకోవడంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
  • వందే భారత్ రైలులో పడుకునే సీట్లు కూడా ఉన్నాయి.
  • దీనితో పాటు ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.
  • రైలులో ప్రయాణికుల వినోదం కోసం 32 అంగుళాల టీవీ స్క్రీన్ ఉంది.
  • వందే భారత్ రైలులో ఫైర్ సెన్సార్, GPS, కెమెరాతో కూడా ఉన్నాయి.

Also read : NDA 2024-July 18 : పవన్ కళ్యాణ్, అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలకు ఆహ్వానం.. జులై 18న ఎన్‌డీఏ కూటమి మీటింగ్

పటిష్ట భద్రతా ఏర్పాట్లు

వందే భారత్ రైలులో “రైల్వే సురక్ష కవాచ్” అనే భద్రతా ఫీచర్ కూడా ఉంది.  ఇది ఇతర రైళ్లతో ఢీకొనకుండా రక్షిస్తుంది. ఈ ఫీచర్ ప్రయాణికులను అవాంఛిత ప్రమాదాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఇది ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇది తక్కువ సమయంలో కూడా రైలును ఆపడంలో సహాయపడుతుంది. వికలాంగులైన ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని, సీట్ల సంఖ్యలు బ్రెయిలీ లిపిలో సీట్ల హ్యాండిల్స్‌పై రాశారు. వికలాంగుల కోసం  స్నేహపూర్వక బయో టాయిలెట్ కూడా ఉంది.