The Truths of Osho: ఓషో ‘జీవిత’ సత్యాలు.. ఆయన మాటల్లో కొన్ని!

ఆధ్యాత్మిక గురువు ఓషోకు సంబంధించిన జీవిత సత్యాలు ఆయన మాటల్లో కొన్ని తెలియజేస్తున్నాం.

Published By: HashtagU Telugu Desk
Osho message

Osho

ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడూ చనిపోలేదు తాను కేవలం ఈ లోకాన్ని December 11, 1931, January 19, 1990 మధ్య సందర్శించడానికి వచ్చాడు అని శిలాశాసనం పై రాసి ఉన్న వ్యక్తి ఓషో (Osho). పుట్టినప్పుడు తన పేరు చంద్ర మోహన్ జైన్ కానీ తరవాత తన పేరును ఆచార్య రజినీష్ గా, ఓషో గా మార్చుకున్నాడు. తన ప్రవచనాలతో ఎల్లపుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకొని ఉండే ఓషో కు ప్రపంచమంతటా శిష్యులు ఉన్నారు. ఆయన చెప్పిన కొన్ని జీవిత సూత్రాలు మీకోసం..

1. “జీవితం మొదలయ్యేది నీలోని భయం చచ్చిపోయినప్పుడే“
2.”వాస్తవానికి దగ్గరగా ఉండు: అద్భుతాలు చేసేందుకు సిద్ధంగా ఉండు“
3. “ఒకరిలా అవ్వాలని ప్రయత్నించకు, నువ్వు ఇప్పటికే ఒకటి అయిపోయావు. మారలేవు. మార్చుకోలేవు. నువ్వు కేవలం నీలో ఉన్నేదేంటో తెలుసుకోవాలంతే“
4. “ఆనందమైనా.. బాధైనా నీ గతం నుంచి వచ్చినవే. వీటికి ఎవరూ బాధ్యులు కాదు నువ్వు తప్ప. నీ ప్రమేయం లేకుండా నీలో ఏ భావాన్ని ఇతరులు సృష్టించలేరు“
5. “తమలోని మొండితనం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు“
6. “ ఒంటరితనం ప్రేమకు నాందివంటిది. వినేందుకు వ్యతిరేకంగా అనిపించినా అది నిజం కాదు. ప్రేమించగల సామర్థ్యం ఉన్న వారే ఒంటరితనాన్ని జయించగలరు. వేరే వాళ్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఇతరులతో అన్ని విషయాలు ముడిపెట్టుకోకుండా ఉన్న స్వతంత్ర్యులే ప్రేమకు అర్హులు“
7. “అసంపూర్తిగా ఉన్న ఈ ప్రపంచమంటే నాకు ఇష్టం. ఎందుకంటే సంపూర్ణమైతే అది ముగిసిపోతుంది. అభివృద్ధి అనేది కేవలం అసంపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే నీకు మళ్లీ మళ్లీ చెబుతున్నా. నేను అసంపూర్ణం, ఈ విశ్వమంతా అసంపూర్ణం, నా సందేశమే అసంపూర్ణం“
8. “ఆనందం పొందేందుకు రహస్య మార్గమేమంటే, నీ మనస్సును గతంలో వదిలేయకు, భవిష్యత్‌లో విహరించమని సూచించకు, నీ సంతోషాన్ని ఎవరూ పాడుచేయలేరు“
9. “మిలియన్ల కొద్దీ మనుష్యులు బాధపడుతున్నారు, ప్రేమించడం రాకపోయినా ప్రేమించబడాలని కోరుకుంటున్నారు, వారికి తెలియన విషయమేమిటంటే ప్రేమంటే ఒక్క పదం మాత్రమేనని. కేవలం ఒక్క పదం మాత్రమేనని“
10. “చాలా మంది జీవితంలోకి వచ్చి వెళ్లిపోతుంటారు, అది నాకు చాలా మంచి చేసింది. ఎందుకంటే వాళ్లు వెళ్లిన ప్రతిసారి ఆ ఖాళీని మరింత మంచి వాళ్లు పూర్తి చేస్తున్నారు, ఇలా నేనెప్పుడూ కోల్పోయిన వాడిలా మిగలలేదు“
11. “చనిపోయాక మరో జీవితం ఉంటుందో లేదోననేది విషయం కాదు, బతుకున్నంత కాలం ఎలా బతికామనేది ముఖ్యం“
12. “అందరూ చెప్తుంటారు, దూకే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, నేను చెప్తాను ముందు దూకేయ్.. ఆ తర్వాత ఎంత దూరం వెళ్లాలో ఆలోచించుకో“
13. “నువ్వు ఎలా అవ్వాలనుకుంటావో అలాగే ఉండు. ఇది కేవలం నీ బాధ్యతే“.

  Last Updated: 23 Dec 2022, 02:12 PM IST