Highest Paid Singers : రెమ్యునరేషన్‌లో టాప్ – 5 సింగర్స్ వీరే.. ఆయనకు ఒక పాటకు రూ.3 కోట్లు

ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటున్న సింగర్స్(Highest Paid Singers) ఎవరు అని అడిగితే చాలామంది.. శ్రేయా ఘోషల్, అరిజిత్ సింగ్ పేర్లు చెబుతుంటారు.

Published By: HashtagU Telugu Desk
Top 5 Highest Paid Singers Ar Rahman

Highest Paid Singers : సింగర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో బాగానే సంపాదిస్తుంటారు. ఒక పాట పాడేందుకు కోట్లు తీసుకుంటున్న సింగర్స్ కూడా ఇప్పుడు ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలోని మూవీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పరంగా టాప్ ర్యాంకుల్లో ఉన్న సింగర్స్ ఎవరు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటున్న సింగర్స్(Highest Paid Singers) ఎవరు అని అడిగితే చాలామంది.. శ్రేయా ఘోషల్, అరిజిత్ సింగ్ పేర్లు చెబుతుంటారు. కానీ అది రాంగ్ ఆన్సర్. సరైన ఆన్సర్ తెలియాలంటే ఈ కథనం చదివేయండి.

Also Read :Pannun Threat : అయోధ్య రామమందిరంపై దాడి చేస్తాం.. ఉగ్రవాది పన్నూ వార్నింగ్

రెమ్యునరేషన్‌లో టాప్ సింగర్లు వీరే.. 

  • ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ 1960వ దశకంలో పాడిన పాటలు ప్రజల మనసులు దోచుకున్నాయి.  అయినా అప్పట్లో ఆమెకు అంతంత మాత్రంగానే రెమ్యునరేషన్‌ వచ్చింది. ఒకవేళ అవే రేంజు కలిగిన పాటలను ఆమె ఈకాలంలో  పాడి ఉంటే కోట్లు వచ్చి ఉండేవి.
  • ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ పాటలకు నేటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లో ఆయన ఒక పాటకు రూ.300 చొప్పున తీసుకునేవారు.
  • ప్రస్తుతం మన దేశంలోని చాలామంది ప్రముఖ గాయకులు ఒక్కో పాటకు రూ.10 లక్షలకుపైనే వసూలు చేస్తున్నారు. కొందరైతే కోట్ల రేంజుకు చేరుకున్నారు.

ఏఆర్ రెహమాన్ నంబర్ 1

రెమ్యునరేషన్ పరంగా మన దేశంలో నంబర్ 1 సింగర్ ఏఆర్ రెహమాన్. ఈయన ప్రతి పాటకు రూ.3 కోట్ల దాకా తీసుకుంటున్నారు. భారతదేశంలోని సగటు సినీ సింగర్స్ తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఇది దాదాపు 15 రెట్లు ఎక్కువ. ప్రతి సంవత్సరం వీలైనన్ని తక్కువ సాంగ్స్ పాడాలని రెహమాన్ భావిస్తుంటారట.  తక్కువ సాంగ్స్ పాడినా.. అవి బెస్ట్‌గా ఉండాలని ఆయన టార్గెట్ పెట్టుకుంటారట. ఎక్కువ రెమ్యునరేషన్ పెడితే.. కేవలం బిగ్ బడ్జెట్ ఉన్న నిర్మాతలు మాత్రమే తనను సంప్రదిస్తారనే ఆలోచనతో రెహమాన్ ఉంటారట. రెహమాన్ తన సాంగ్స్‌కు తానే మ్యూజిక్ కంపోజిషన్ ఇచ్చుకోవడానికి ఇష్టపడతారట. వేరొకరికి కంపోజిషన్‌ అప్పగించి.. తనను పాడమంటే మాత్రం రూ.3 కోట్ల ఛార్జీని ఆయన వసూలు చేస్తారట.

Also Read :Miraya Vadra : మిరాయా వాద్రా ఎవరో తెలుసా ? ప్రియాంకకు మద్దతుగా ప్రచారం

అత్యధిక రెమ్యునరేషన్ పొందే ఇతర గాయకులు

  • ప్రముఖ గాయకురాలు శ్రేయా ఘోషల్ ఒక్కో పాటకు రూ. 25 లక్షలు తీసుకుంటారట.
  • సునిధి చౌహాన్ ఒక పాటకు రూ. 20 లక్షల దాకా వసూలు చేస్తారట.
  • అరిజిత్ సింగ్ కూడా ఒక సాంగ్‌కు రూ.20 లక్షలు తీసుకుంటారట.
  • సోనూ నిగమ్ ఒక పాటకు రూ.18 లక్షల దాకా వసూలు చేస్తారు.
  • సింగర్ దిల్జిత్ దోసాంజ్ కూడా రూ.10 లక్షలకుపైనే ఒక సాంగ్‌కు తీసుకుంటారట.
  Last Updated: 11 Nov 2024, 04:39 PM IST