Site icon HashtagU Telugu

Natu Natu Dance by Puppet: ‘నాటు నాటు’ పాటకు కు డ్యాన్స్ అదరగొట్టిన తోలుబొమ్మ..!

natu Natu

The Puppet Who Danced To The Song 'natu Natu'..!

‘నాటు నాటు’ (Natu Natu) పాట స్థాయి ఆస్కార్ అవార్డుతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ అయింది. దేశ సరిహద్దులతో సంబంధం లేకుండా, సామాన్యులు, సెలబ్రిటీలు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ నాటు నాటు పాటకు ఊగిపోతున్నారు. కెనడా, జపాన్, అమెరికాలోనూ ఈ పాటకు డ్యాన్స్ కట్టడాన్ని చూశాం. ఆస్కార్ వేదికపైనా ప్రత్యేకంగా ఈ పాటకు నృత్యం చేయించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం, రామ్ చరణ్ తో కలసి ఈ పాటకు స్టెప్స్ వేశారు. ఏదైనా పాటకు ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేయడం సాధ్యమే. కానీ, ఓ తోలుబొమ్మతో నాటు నాటు (Natu Natu) పాటకు అదరిపోయే మాదిరిగా డ్యాన్స్ చేయించడం అన్నది అంత సులభమైనది అయితే కాదు. ఓ తోలుబొమ్మతో ఓ మహిళ చేయించిన నాటు నాటు డ్యాన్స్ వీడియోని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

‘‘ఒకే ఒకే ఒక లాస్ట్ ట్వీట్. నాటు నాటు పై నేను ఒక హామీ ఇస్తున్నాను. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తాన్ని తన తీగలపై కలిగి ఉంది’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోని చివరి వరకు చూస్తే శభాష్ అని అనకుండా ఉండలేరు.

Also Read:  India vs Australia: మేలుకోకుంటే కష్టమే.. ఆసీస్‌పై సిరీస్ ఓటమి ఓ గుణపాఠం..