Babu Jagjivan Ram: బాబు బీట్స్ బాబీ!

‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు’ ఈ మాట సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రాం కు అతికినట్టుగా సరిపోతోంది.

  • Written By:
  • Updated On - April 6, 2022 / 12:12 PM IST

‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు’ ఈ మాట పేదల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రాం కు అతికినట్టుగా సరిపోతోంది. సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టిన దేశాభివృద్ధికి పాటుపడ్డారు. ‘‘హరిత విప్లవం, బంగ్లాదేశ్ కు విముక్తి’’కి సైతం క్రియాశీలకంగా వ్యవహరించారాయన. ఇందిరాగాంధీ పాలనలోనూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టించారు. అయితే దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితుల ద్రుష్ట్యా ఈయన ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

ప్రజాసంక్షేమం కోసం జగ్జీవన్ ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ అనే కొత్త పార్టీ స్థాపించారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు, ఇందిరావర్గీయులు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ వేదికగా సభ ఏర్పాటు చేశారు. అయితే ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు జగ్జీవన్ రాం సభకు జనాలు వెళ్లకుండా ఉండేందుకు ఆంక్షలు విధించారు.

అంతేకాక సభ జరిగే రోజున హిందీ హిట్ మూవీ (బాబీ) సినిమాను ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నారు. అప్పట్లో ఏకైక టెలివిజన్ దూరదర్శన్ లో బాబీ సినిమాను టెలికాస్ట్ చేశారు. అయితే జనాలు ఇవేమీ పట్టించుకోకుండా జగ్జీవన్ రాం సభకు హాజరై ఊహించని విధంగా సక్సెస్ చేశారు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశానికి ఎంతో సేవ చేయాలని జగ్జీవన్ రాం మదిలో ఉన్నా.. ఇందిరా ఒత్తిడి కారణంగా దూరంగా ఉండిపోయారు. అయినా వెనకడగు వేయకుండా తనవంతుగా ప్రజా సంక్షేమానికి పాటుపడటం ఆయనకే చెల్లింది.