Site icon HashtagU Telugu

After Sunset: నింగిలో మూడు నక్షత్రాలు దర్శనమిస్తున్న ఘటన

After Sunset

After Sunset

సూర్యాస్తమయం తర్వాత (After Sunset) ఆకాశంలో అరుదైన దృశ్యాన్ని వీక్షించారా..? చూడకపోతే ఈ రోజు అయినా చూడండి. అరుదుగా వచ్చే ఇలాంటి విశేషం ఇప్పుడు నింగిలో కనిపిస్తోంది. శుక్రుడు, గురుడు, చంద్రుడు ఈ మూడు గ్రహాలు దగ్గర దగ్గరగా కనిపిస్తున్నాయి. భూమికి అతి చేరువగా రావడం వల్లే ఈ విశేషం చోటు చేసుకుంది. సూర్యాస్తమయం తర్వాత (After Sunset) తూర్పు వైపు ఆకాశాన్ని గమనిస్తే చంద్రుడు దర్శనమిస్తాడు. రాత్రి 7 గంటల సమయంలో చూసినప్పుడు శుక్రుడు (వీనస్), గురుడు (జూపిటర్) ఈ రెండు నక్షత్రాలు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంటాయి. వీటికి చేరువలోనే చందమామ కూడా ఉంటుంది.

ఈ విశేషం మరికొన్ని రోజుల పాటు కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మార్చి 1 నాటికి శుక్రుడు, గురుడు మరింత చేరువగా వస్తాయి. ఆ సమయంలో ఇవి భూ ఉపరితలానికి సమీపానికి చేరుకుంటాయి. ఫలితంగా స్పష్టంగా చూడొచ్చు. ఆ తర్వాత నుంచి శుక్రుడు, గురుడు దూరంగా వెళుతుంటారు. హైదరాబాద్ సచివాలయం పైన ఈ శుక్రుడు (అన్నింటి కంటే కింద), గురుడు (మధ్యన), చంద్రుడు (పైన) ఉండడాన్ని ఫొటోల్లో చూడొచ్చు. శుక్రగ్రహం మన భూమికి అతి చేరువగా ఉండే గ్రహం. సూర్యుడు, భూమి తర్వాత మూడో అతిపెద్ద గ్రహం. భూమి రేడియస్ 12,756 కిలోమీటర్లు కాగా, శుక్రుడి రేడియస్ 12,104 కిలోమీటర్లు చంద్రుడి రేడియస్ 1,737.4 కిలోమీటర్లు.

Also Read:  Amaravati: అమరావతికి సుప్రీం ముహూర్తం! అసెంబ్లీలో ‘మూడు’ లేనట్టే!