British Coin and Telugu: బ్రిటిష్ నాణంపై తెలుగు.. స్వాతంత్ర్యానికి ముందే మన భాషకు గుర్తింపు.. మీరు చూశారా?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య  గురించి తెలిసే ఉంటుంది. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 10:00 AM IST

తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య  గురించి తెలిసే ఉంటుంది. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను గ్రామంలో జన్మించారు. ఇకపోతే మన దేశానికి స్వాతంత్రం రాకముందు భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై ఉద్యమంలో చేరారు. ఈ విధంగా గాంధీజీకి ఎంతో సన్నిహితంగా ఉండే సీతారామయ్య కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి చేపట్టారు.ఇక ఈయన తెలుగు వారు కావడంతో నిత్యం తెలుగు భాష గురించి తెలుగు రాష్ట్రం గురించి ఎంతో గొప్పగా మాట్లాడేవారు.

అప్పట్లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరుగుతుంది ఈ కమిటీలో భాగంగా గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్,భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర రాష్ట్రం నిర్మాణ సమస్యలను ఈ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విధంగా ఈయన తన తెలుగు రాష్ట్రం కోసం పడుతున్న కష్టం చూసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడుతూ.. పట్టాభి ఎప్పుడు చూసినా తెలుగు రాష్ట్రం కోసం ఇలా కష్టపడుతున్నావు అసలు తెలుగు రాష్ట్రం ఎక్కడుంది మీరందరూ మద్రాసీలు కదా అంటూ హేళన చేశారు.

ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుగు రాష్ట్రమే లేదని చెప్పడంతో పట్టాభి జేబులో ఉన్న ఒక అణాను తీసి చూపిస్తూ దీనిపై అధికార భాష అయిన ఇంగ్లీష్ జాతీయ భాష అయిన హిందీ ఉంది. అలాగే ప్రజలు ఎక్కువగా మాట్లాడే బెంగాలీ భాష కూడా ఉంది. దీనితో పాటు తెలుగు భాషలో కూడా ఈ నాణెంపై ‘ఒక అణా’ అని రాశారు. ఇది బ్రిటీష్ ప్రభుత్వం తయారుచేసిన నాణేం.అయితే ఇది తయారుచేస్తున్న సమయంలో భారతదేశానికి స్వాతంత్రం కూడా రాలేదు మరి ఇందులో మీ గుజరాతి భాష లేదు అని అనగానే అక్కడున్న వారందరూ నోరు తెరిచి ఆశ్చర్యపోయారు. ఇలా స్వాతంత్రం రాకముందే తెలుగు భాషకు ఎంతో మంచి గుర్తింపు లభించిందని వెల్లడించారు.