మీరు బాహుబలి సినిమా చూశారు.. అందులో శివగామి అనే పాత్ర అప్పుడే పుట్టిన బిడ్డను శత్రువుల బారి నుంచి కాపాడి నది ఒడ్డుకు చేరుతుంది. అప్పటికే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శివగామి నదిలో కొట్టుకుపోతున్నా.. ఆ పసిబ్డిను చేతులతో పైకెత్తి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆ సీన్ ఇప్పటికీ ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. అలాంటి సీన్ నిజజీవితంలో జరిగితే ఏమనాలి? రియల్ బాహుబలి అనాల్సిందే. నెల రోజుల పసిబిడ్డను ఎత్తుకొని నడుంలోతు వర్షపు నీటిలో గ్రామాన్ని దాటుతున్న ఓ వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సీన్ ఇప్పుడు బాహుబలి సినిమాను గుర్తుచేస్తుంది.
ఈ ఘటన తెలంగాణలోని మంథనిలో చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా గ్రామం నీటిలో మునిగిపోయింది. మంథనిలోని మర్రివాడ గ్రామం వర్షపు నీటితో నిండిపోవడంతో పట్టణానికి వెళ్లే మార్గాలన్నీ గోదావరి నదిలో మునిగిపోయాయి. పసిపాపతో ఉన్న ఓ కుటుంబం వరద నీటిలో చిక్కుకుపోయింది. కొంతమంది గ్రామస్థుల సహాయంతో, కుటుంబ సభ్యులు పసిబిడ్డను బుట్టలో మోసుకెళ్లి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తమను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని పంపించాలని మంథని ప్రజలు కోరుతున్నారు.
The real-life Baahubali! Man carries a months-old baby over his head in a basket in flood affected village of Manthani. #TelanganaFloods #TelanganaRain pic.twitter.com/0Y0msp8Jbp
— Dula Bhai (@kaikusabapku) July 14, 2022