T-shirt Printing Business: టీషర్ట్‌ ప్రింటింగ్ బిజినెస్ : నెలకు రూ.లక్ష సంపాదించుకోండి

టీషర్టులు (T-Shirt) ధరించడం ఇటీవల కాలంలో సర్వ సాధారణమైంది. ఈ తరుణంలో తక్కువ పెట్టుబడితో టీషర్ట్‌లపై ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్స్‌ వేయడం మంచి బిజినెస్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
T-Shirt Printing Business.. Earn Rs.1 Lakh Per Month

T Shirt Printing Business.. Earn Rs.1 Lakh Per Month

T-shirt Printing Business : టీషర్టులు ధరించడం ఇటీవల కాలంలో సర్వ సాధారణమైంది. ఈ తరుణంలో తక్కువ పెట్టుబడితో టీషర్ట్‌లపై ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్స్‌ వేయడం మంచి బిజినెస్ గా మారింది. సినిమా ప్రమోషన్‌ కోసం, ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ కోసం, కార్పొరేట్‌ ప్రమోషన్స్ కోసం, స్పోర్ట్స్‌ ఈవెంట్స్ కోసం, పొలిటికల్‌ ర్యాలీల కోసం, 5కె, 2కె రన్‌, గణేష్ ఉత్సవాల ఊరేగింపులు, ఇలాంటి అన్ని కార్యక్రమాల కోసం టీ షర్ట్స్‌ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని చాలా తక్కువ డబ్బుతో స్టార్ట్ చేయొచ్చు.

టీషర్ట్స్‌పై ప్రింట్ (T-Shirt Printing) వేసే మిషన్‌ కొనేందుకు రూ.12వేల నుంచి రూ.18వేలలోపు మాత్రమే ఖర్చవుతుంది. పెద్ద ఎత్తున టీషర్ట్‌ల ఆర్డర్‌ వస్తే రూ.75 వేల నుంచి రూ.లక్ష విలువ కలిగి ఉన్న మిషన్‌ను కొనాల్సి ఉంటుంది. మీరు పెద్ద స్థాయిలో ఈ బిజినెస్ చేయాలనుకుంటే.. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల పెట్టుబడితో ఆటోమేటిక్ మెషీన్ ను తీసుకురావచ్చు. కేవలం టీషర్ట్‌లపైనే కాకుండా ప్లేట్లపై, మగ్స్‌పై, తలకు పెట్టుకునే టోపీలపైనా ప్రింటింగ్‌ వేయడానికి ఆర్డర్లు తెచ్చుకుంటే మీకు మరింత అదనపు ఆదాయం వస్తుంది. సెల్‌ఫోన్‌ కవర్లపై, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌పై కూడా ప్రింటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో ప్రతి నెలా 50,000 సంపాదించుకోవచ్చు. మహిళలు ఇంటి దగ్గరుండి ఉపాధి పొందేందుకు ఇది మంచి వ్యాపార మార్గం.

ఇలా రెడీ కండి..

  1. ప్రింటింగ్ కోసం మీకు ప్రింటర్, హీట్ ప్రెస్, కంప్యూటర్, ప్లేన్ టీ షర్టులు అవసరం.
  2. మీరు మాన్యువల్ మెషీన్‌తో పనిని ప్రారంభించవచ్చు, దీనిలో మీరు 1 నిమిషంలో 1 T- షర్టును సిద్ధం చేయవచ్చు.
  3. ఇండియా మార్ట్‌ వెబ్‌సైట్‌లో క్లిక్‌ చేస్తే.. సెర్చ్ బార్‌లో టీషర్ట్‌ ప్రింటింగ్ మిషన్లు ఎక్కడ దొరుకుతాయి ? వాటి ధర ఎంత ? మన్నిక ఎంత ? అనేది తెలిసిపోతుంది.
  4. టీ షర్ట్ ప్రింటింగ్ కోసం టెఫ్లాన్ షీట్ ఖరీదు రూ.400, సబ్లిమేషన్ టేప్ ఖరీదు రూ. 200 ఉంటుంది. ప్రింటింగ్ మెషీన్ ధర్ రూ. 13వేల నుంచి ప్రారంభమవుతుంది. సబ్లిమేషన్ ప్రింటింగ్ ఇంక్ ధర రూ. 2000 దాకా ఉంటుంది.
  5. ప్లేన్ టీషర్ట్స్ ధర రూ. 30 నుంచి రూ.150 మధ్య క్వాలిటీని బట్టి బల్క్ గా దొరుకుతాయి.
  6. మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ల ద్వారా లేదా వస్త్ర వ్యాపారులతో డీల్ చేసుకొని మీ టీ షర్టులను విక్రయించవచ్చు.
  7. మీ బిజినెస్ మార్కెటింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను ఆశ్రయించవచ్చు.
  8. ఉదాహరణకు ఒక ప్లేన్ టీషర్టు విలువ రూ. 100 ఉంటే దాన్ని ప్రింట్ వేసిన తర్వాత మార్కెట్లో రూ.200 దాకా ధరకు సేల్ చేయొచ్చు. అంటే డబుల్ లాభం వస్తుంది.
  9. మీ ప్రతి టీ షర్టు కనీసం రూ.250-500 రేంజ్ ధరలో విక్రయం అవుతుంది. మధ్యవర్తి లేకుంటే మీరు ప్రతి టీ షర్టుపై 50% లాభం పొందొచ్చు.

Also Read:  Business Ideas: 9 బెస్ట్ స్మాల్ బిజినెస్ ఐడియాస్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం

  Last Updated: 01 May 2023, 04:03 PM IST