Insurance Policy : ఏప్రిల్ 1 విడుదల.. ‘బీమా పాలసీ సరెండర్’ కొత్త రూల్స్

Insurance Policy : బీమా పాలసీల ప్రీమియంలు చాలామంది రెగ్యులర్‌గా కడుతుంటారు.

  • Written By:
  • Updated On - March 27, 2024 / 04:28 PM IST

Insurance Policy : బీమా పాలసీల ప్రీమియంలు చాలామంది రెగ్యులర్‌గా కడుతుంటారు. కానీ కొంతమంది దీర్ఘకాలం పాటు కట్టలేక, పాలసీ వ్యవధి మధ్యలోనే దాన్ని రద్దు చేసుకుంటారు. ఇలాంటి సందర్భంలో అప్పటి వరకు పాలసీదారు కట్టిన డబ్బును తిరిగి ఇచ్చేటప్పుడు.. సరెండర్‌ ఖర్చులు, ఛార్జీలు, టాక్స్‌లను బీమా కంపెనీ వసూలు చేస్తుంది. ఈక్రమంలో ఇప్పటిదాకా సరెండర్‌ వాల్యూ చాలా తక్కువగా ఉండేది. దీనివల్ల పాలసీదారులకు నష్టం జరిగేది.  సరెండర్ వ్యాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే .. పాలసీని సరెండర్ చేశాక అంత ఎక్కువ అమౌంట్ పాలసీదారుడికి అందుతుంది. ఈనేపథ్యంలో పాలసీదారులకు లాభం చేకూరేలా తాజాగా సరెండర్ విలువను ‍‌పెంచుతూ ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (IRDAI) కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

We’re now on WhatsApp. Click to Join

కొత్త రూల్స్ ఇవిగో..

  • కొత్త రూల్స్ ప్రకారం.. బీమా పాలసీ(Insurance Policy) తీసుకున్న తేదీ నుంచి మూడేళ్లలోగా సరెండర్‌ చేస్తే.. దాని సరెండర్‌ విలువ యథాతథంగా లేదా కాస్త తక్కువగా ఉంటుంది.
  • పాలసీ తీసుకున్న  4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య సరెండర్‌ చేస్తే, సరెండర్‌ వాల్యూ కొద్దిగా పెరుగుతుంది. దీనివల్ల అప్పటివరకు పాలసీ కోసం చెల్లించిన మొత్తం ప్రీమియం కంటే కొద్దిగా ఎక్కువ మొత్తం పాలసీదారుడి చేతికి తిరిగొస్తుంది.
  • ఏడు సంవత్సరాలకు మించి ప్రీమియం చెల్లించిన పాలసీని సరెండర్‌ చేస్తే.. సరెండర్‌ వాల్యూ ఇంకా ఎక్కువగా ఉంటుంది.
  • ఎంత ఎక్కువ కాలం పాలసీని హోల్డ్‌ చేస్తే సరెండర్‌ విలువ అంత ఎక్కువగా ఉంటుంది.

Also Read :INDIA bloc : ఇండియా కూటమిలో చీలిక.. ఆ పార్టీ ఔట్

వామ్మో పాత రూల్స్.. డేంజర్

  • ప్రస్తుతం ఉన్న రూల్స్ విషయంలోకి వెళితే..  2 సంవత్సరాల పాటు పూర్తి ప్రీమియంలు చెల్లించిన తర్వాత, ఆ పాలసీని మెచ్యూరిటీ గడువు లోపులో ఎప్పుడైనా సరెండర్ చేయొచ్చు.
  • రెండేళ్ల కంటే ముందు పాలసీని సరెండర్ చేస్తే ఒక్క రూపాయి కూడా పాలసీదారుకు తిరిగి రాదు.
  • 2 సంవత్సరాల తర్వాత, గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూని మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇందులోనూ చాలా భారీ ఖర్చును చూపిస్తుంది.
  • ఏప్రిల్‌ 01 నుంచి ఈ లెక్కలన్నీ మారిపోతాయి.

Also Read :3 Body Problem : ఆ వెబ్ సిరీస్ తడాఖా.. రెండు నవలల సేల్స్‌కు రెక్కలు