Site icon HashtagU Telugu

Farmer Success Story: చదివింది పది.. కానీ సేంద్రియ వ్యవసాయంతో ఏడాదికి రూ.70 లక్షల సంపాదన?

Former Success Story

Former Success Story

Farmer Success Story: డబ్బు సంపాదించాలి అంటే చాలామంది కేవలం చదువు ఉండాలి తెలివి ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే డబ్బు సంపాదించడానికి చదువు లేకపోయినా తెలివి ఉంటే చాలు అని ఇప్పటికీ ఎంతోమంది నిరూపించిన విషయం తెలిసిందే. చదువు లేకపోయినా సరిగా చదువుకోకపోయినా చాలామంది ఏడాదికి లక్షలకు లక్షలు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా ఒకరు. పది పాస్ అయినప్పటికీ ఒక రైతు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కుతూ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఏటా 70 లక్షలకు పైగా డబ్బులు సంపాదిస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని బిల్వారాకు చెందిన అబ్దుల్ రజాక్ అనే ఒక రైతు రసాయనిక ఎరువులతో పండించిన పంటలు తిని అతని తండ్రి కాన్సర్ బారిన పైడి మరణించాడు. దాంతో తండ్రి మరణంతో కుమారుడు అబ్దుల్ రజాక్ లో కొత్త ఆలోచన రేకెత్తింది. తండ్రి లాంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదని అనుకున్నాడు. అందుకోసం సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆలోచించి సేంద్రియ వ్యవసాయంతో భారీగా లాభాలను పొందుతున్నాడు. తనుకున్న పదెకరాల భూమిలో సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో దోసకాయ, టమాట, క్యాప్సికం,ఆనపకాయ కూరగాయలతో పాటుగా జామా నారింజ వంటి పండ్లను కూడా పండిస్తున్నాడు.

ప్రస్తుతం తాను పండిస్తున్న పంటల ద్వారా ఏటా కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నాడు అబ్దుల్ రజాక్. అందులో 30 లక్షల వరకు పంట పెట్టుబడి పోగా 70 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు. అయితే తను తన పంటలకు జీవామృతం ఆవు మూత్రం దేశి ఎరువు పచ్చి ఎరువుతో పాటు బ్యాక్టీరియల్ కల్చర్, బయో పెస్టిసైడ్, క్రీసోపో వంటి బయో ఏజెంట్లను ఉపయోగిస్తున్నాడు. దాంతో పంట దిగుబడి పెరుగుతుంది. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు అబ్దుల్ రజాక్ వద్దకు వచ్చి వ్యవసాయం గురించి మెలకువలు తెలుసుకుంటున్నారు. రైతులకు కూడా అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ద్వారా ఉచిత సమాచారాన్ని కూడా అందిస్తున్నాడు రజాక్.