Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చాలించి.. ఇక ఆఫీసుకు రండి.. ఉద్యోగులకు ప్రముఖ కంపెనీల ఆర్డర్

కరోనా మహమ్మారి ముగియడంతో అనేక ప్రముఖ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు గుడ్ బై చెప్పాయి. తమ ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని తేల్చి చెప్పాయి.

కరోనా (Corona) మహమ్మారి ముగియడంతో అనేక ప్రముఖ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) కు గుడ్ బై చెప్పాయి. తమ ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని తేల్చి చెప్పాయి. ఈవిధంగా ఉద్యోగులను కోరుతున్న కంపెనీల లిస్ట్ లో మెటా (ఫేస్ బుక్ ) తో పాటు, అమెజాన్, స్టార్‌ బక్స్, వాల్ట్ డిస్నీ (World Disney) కూడా ఉన్నాయి.

అమెజాన్ (Amazon) :

మే 1 నుంచి వారానికి 3 రోజులు కార్యాలయానికి రావాలని అమెజాన్ కంపెనీ తమ ఉద్యోగులను కోరింది. ఆఫీసుకు ఎప్పుడెప్పుడు రావాలి అనేది కంపెనీ సిబ్బంది డిసైడ్ చేసుకోవచ్చని, ఈమేరకు వారికి స్వేచ్ఛ ఇస్తామని అమెజాన్ CEO ఆండీ జాస్సీ ఇటీవల పేర్కొన్నారు.

మెటా (Facebook) :

సహోద్యోగులతో వ్యక్తిగతంగా కలిసి పనిచేసేలా మా ఎంప్లాయీస్ ను ప్రోత్సహిస్తామని మెటా (ఫేస్ బుక్) అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఇటీవల వెల్లడించారు. కంపెనీ మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత .. మరో 10,000 మంది కార్మికులను కూడా తొలగిస్తామని ఆయన ప్రక టించారు.

జనరల్ మోటార్స్ (General Motors) :

కార్‌ మేకర్ జనరల్ మోటార్స్ తన ఉద్యోగులను జనవరి 30 నుంచి కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. సిబ్బంది వారానికి మూడు రోజులు కార్యాలయాలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రకటన జనరల్ మోటార్స్‌లోని కార్పొరేట్ ఉద్యోగులలో అలజడి రేపింది.

న్యూస్ కార్ప్ (News Corp) :

వాల్ స్ట్రీట్ జర్నల్ యొక్క ప్రచురణకర్త అయిన న్యూస్ కార్ప్ ఇటీవల తన ఉద్యోగులకు ఆఫీస్ మెమోను జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఇక ఉండదని తేల్చి చెప్పింది.కార్యాలయానికి తిరిగి రావాలని ఉద్యోగులను కోరింది.

స్నాప్ ఇంక్ (Snap Ink) :

ఈ కంపెనీ CEO ఇవాన్ స్పీగెల్ తమ ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ విధానాన్ని ఆయన “డిఫాల్ట్ టుగెదర్”గా అభివర్ణించారు.  స్నాప్‌చాట్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల డెవలపర్ ఇవాన్ స్పీగెల్ 2022 ఆగస్టులో దాని వర్క్‌ఫోర్స్‌లో 20% మందిని తొలగించాడు. అది జరిగిన 6 నెలల తర్వాత ఇవాన్ స్పీగెల్ తాజా ప్రకటన చేశారు.

స్టార్‌ బక్స్ (Starbucks) :

స్టార్‌ బక్స్ తాత్కాలిక CEO హోవార్డ్ షుల్ట్జ్ తన ఉద్యోగులకు జనవరిలో ఒక కీలక ఆదేశం ఇచ్చారు. వారానికి మూడు రోజులు కార్యాలయాలకు రావాలని కోరారు. కార్పొరేట్ సిబ్బంది వారానికి ఒకటి నుంచి రెండు రోజులు కార్యాలయంలో ఉండాలని సూచించారు. అయితే స్టార్‌బక్స్ కంపెనీలో బ్యాడ్జింగ్ డేటా చాలా తక్కువకు పడిపోయిందని చూపిస్తుంది.

Also Read:  Get Best Results In Exams: ఉత్తమ ఫలితాలు రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి..?