Local Boy: అమ్మకు ప్రేమతో.. తల్లి కోసం బావిని తవ్విన కొడుకు!

తల్లి నీటి కష్టాలు తీర్చడం కోసం ఎవరు చేయని సాహాసానికి పూనుకున్నాడు ఓ కొడుకు.

  • Written By:
  • Updated On - May 24, 2023 / 09:40 AM IST

తన తల్లి నీటి కష్టాలు తీర్చడం కోసం ఎవరు చేయని సాహాసానికి పూనుకున్నాడు. పలుగు, పార పట్టుకొని ఒక్కడే బావి తవ్వడం ప్రారంభించాడు. ఎండలు మండిపోతున్నా.. వర్షాలు కురుస్తున ఏమాత్రం వెనుకడగు వేయకుండా బావిని తవ్వాడు. కేవలం భోజనం చేసేందుకు మాత్రమే రెస్ట్ తీసుకునేవాడంటే ఏస్థాయిలో శ్రమించాడో తెలుసుకోవచ్చు.

మహారాష్ట్రానికి చెందిన ప్ర‌ణ‌వ్ 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ప్ర‌ణ‌వ్ త‌ల్లిదండ్రులు ద‌ర్శ‌న‌, వినాయ‌క కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. వారు నివసించే ద‌వంగే ప‌డా ఏరియాలో తీవ్ర నీటి క‌ష్టాలున్నాయి. దీంతో త‌ల్లి ద‌ర్శ‌న ప్ర‌తి రోజు ఓ చెరువు వ‌ద్ద‌కు వెళ్లి నీళ్లు తెచ్చేది. త‌ల్లి క‌ష్టాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోయిన ప్ర‌ణవ్‌.. త‌న‌కు స‌మ‌యం దొరికిన‌ప్పుడల్లా.. ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే ఓ బావిని త‌వ్వాడు. కేవలం ఐదు రోజుల్లోనే బావిని తవ్వాడు. అమ్మకోసం కష్టపడుతున్న ఆ బాలుడి కష్టాన్ని గంగమ్మ కూడా అర్థమైందేమో. భూమిలోంచి ఉబికి వచ్చింది.

ఈ నీటిని చూసిన ప్రణవ్ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రణవ్ ప్రయత్నాన్ని ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయాడు. అతను ఒక సూపర్ హీరో అంటూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం 20 అడుగుల ఎత్తులో నీరు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు గ్రామస్తులు.