Birds Facts: కిక్కు కోసం.. కెమికల్స్ కోసం.. పక్షుల వెతుకులాట

పక్షుల చేష్టలను చూసి మనం ఆశ్చర్యపోతుంటాం.

  • Written By:
  • Updated On - July 1, 2024 / 08:01 AM IST

Birds Facts:  పక్షుల చేష్టలను చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. వాటి లైఫ్ స్టైల్ ఎంతో ఆసక్తికరంగా, ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. దీని వెనుక దాగిన సైన్సుకు సంబంధించిన పలు విశేషాలు తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన రీసెర్చ్‌లో వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • కొన్ని పక్షులు యాంటింగ్ చేస్తుంటాయి. అవి చీమలను వాటి రెక్కలు, చర్మంతో రుద్దుతుంటాయి. లైంగిక ఉద్దీపన, మానసిక ఉద్దీపన కోసం పక్షులు ఇలా చేస్తుంటాయని కొందరు సైంటిస్టులు తెలిపారు.  ఈవిధంగా చేయడం వల్ల చీమల నుంచి ఫార్మిక్‌ యాసిడ్‌ విడుదలై పక్షుల రెక్కలు, చర్మంలోకి చేరుతుంది. ఫార్మిక్‌ యాసిడ్ అనేది ఘాటైన కెమికల్.. ఇది పక్షుల రెక్కలు శరీరంలోకి ప్రమాదకర కీటకాలు చేరకుండా అడ్డుకోగలదు.
  • కొన్ని పక్షులు, చిలుకలు మిరియాల తీగను నమిలి, దాని పిప్పిని తమ ఈకలపై చల్లుకుంటాయి. హానికర పరాన్నజీవుల నుంచి రక్షణ పొందడానికి అవి ఇలా చేస్తుంటాయని శాస్త్రవేత్తలు రీసెర్చ్‌లో గుర్తించారు. మిరియాల తీగలోని పిపరీన్‌ అనే పదార్థంలో ఔషధ గుణాలు ఉంటాయి.  మిరియాల తీగను శరీరానికి పులుముకునేటప్పుడు చిలుకలు ఉత్సాహంగా కనిపించాయని రీసెర్చ్‌లో వెల్లడైంది.

Also Read :NTR Bharosa Pension : స్వయంగా పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు

  • కొన్ని పక్షులు పండిపోయి, పులిసిపోయిన పండ్లు, బెర్రీలను తింటుంటాయి. వాటిని తిన్నాక పక్షులు మత్తులోకి జారుకుంటాయి.  న్యూజిలాండ్‌లో కెరెరు అనే ఒక రకం పావురానికి ఈవిధమైన అలవాటు ఎక్కువగా ఉంది. ఈ జాతి పక్షులు తరచూ మత్తులోకి జారిపోయి, చెట్ల పైనుంచి కిందకు పడిపోతుంటాయి.
  • మన దేశంలో 1,358 పక్షి జాతులు ఉన్నాయి. వీటిలో 79 పక్షి జాతులు ప్రత్యేకంగా మనదేశానికే పరిమితమైనవి. ఈ ప్రత్యేక పక్షి జాతుల్లో 28 పశ్చిమ కనుమల ప్రాంతంలోనే ఉండటం గమనార్హం. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పెద్దసంఖ్యలోనే అరుదైన పక్షి జాతులు ఉన్నాయి.

Also Read :Kalki 2898AD : కల్కి 500 కోట్లు కౌంటింగ్.. ఇది ప్రభాస్ మాస్ విజృంభన..!

  • పామును ఇష్టమైన ఆహారంగా చేసుకున్న పక్షి ప్రపంచంలో ఏదైనా ఉందా? అంటే ఉంది. దాని పేరు.. రోడ్‌ రన్నర్లు.   అమెరికా, మెక్సికోలో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. విషపూరిత పాములను కూడా ఈ పక్షులను వదలకుండా తింటాయి. ఎడారి ప్రాంతాల్లో కనిపించే రాటిల్ పాములు వీటికి ఇష్టమైన ఆహారం. 1.5 నుంచి 2 మీటర్ల పొడవున్న పామును కూడా ఈ పక్షి కొన్ని సెకన్లలో చంపేస్తుంది.