Site icon HashtagU Telugu

Sircilla: స్వయం ఉపాధిలో సిరిసిల్ల, జాతీయ జెండాలు తయారుచేస్తూ, జీవనోపాధి పొందుతూ!

Siricilla

Siricilla

రానున్న స్వాతంత్య్ర దినోత్సవానికి జాతీయ జెండాల తయారీతో సిరిసిల్ల, హైదరాబాద్‌లోని టెక్స్‌టైల్ యూనిట్లు కళకళలాడుతున్నాయి. గత ఏడాది మాదిరిగానే రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ప్రభుత్వం కోటి జాతీయ జెండాలకు ఆర్డర్ ఇచ్చింది. జెండాల పంపిణీ బాధ్యత TS హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (TESCO)పై ఉంది. ప్రస్తుతం సిరిసిల్లలో దాదాపు 75 లక్షల జెండాలు ప్రింటింగ్‌, కుట్లు, ప్యాకింగ్‌లు జరుగుతున్నాయని, మిగిలిన 25 లక్షల జెండాలు హైదరాబాద్‌లో ప్రాసెస్‌ అవుతున్నాయని టెస్కో అధికారులు తెలిపారు.

సంబంధిత జిల్లాలకు జెండాలను ప్యాకింగ్ చేసి పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని అధికారిక వర్గాల సమాచారం. ఈ జెండాలు దేశవ్యాప్తంగా ఉన్న గృహాలు, వ్యాపార సంస్థలపై ఎగురవేయబడతాయి. హైదరాబాద్‌లోని యూనిట్లలో జెండాల రూపకల్పన, ముద్రణ జరుగుతోంది. ఈ జాతీయ జెండాల తయారీ కోసం సుమారు 65 లక్షల మీటర్ల పాలిస్టర్ క్లాత్‌ను ఉత్పత్తి చేశారు. ముడిసరుకులను గుజరాత్ రాష్ట్రం నుండి దిగుమతి చేసుకున్నారు.

జెండా తయారీతో వందలాది మందికి ఉపాధి కల్పించినట్టయింది. సరోజ అనే మహిళ తాను పనుల కోసం రోజుకు రూ. 1,200 సంపాదిస్తున్నట్లు తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కత్తిరించడం, కుట్టడం, ప్యాకింగ్ చేయడం వంటి పనులు ఉంటాయని చెప్పారు. గత ఏడాది ఒక్కో జెండాకు ప్రభుత్వం రూ.12 చెల్లించగా, ఈ ఏడాది కూడా అదే ధర చెల్లిస్తోంది.

Also Read: Dharmapuri Arvind: దమ్ముంటే కేసీఆర్ ను పోటీకి దింపండి, కేటీఆర్ కు అర్వింద్ ఛాలెంజ్!