Site icon HashtagU Telugu

Lord Ganesh: వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుక అసలు రహస్యం ఏంటీ?

Clayganesh

Clayganesh

భారత దేశంలోని హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలు వినాయక చవితి కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ కూడా చాలా గ్రాండ్ గా ఇలా బ్రేక్ చేసుకుంటూ ఉంటారు. వినాయక చవితి రోజున గణేషునీ భారీ విగ్రహాలను కూర్చోబెట్టి వాటికి పెద్ద పెద్ద మండపాలు వేసి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా రకరకాల పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది భాద్రపద శుక్ల చతుర్థి సమయంలో వినాయక చవితి పండుగను భారతీయులు ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారు? వినాయక చవితి యొక్క విశిష్టత ఏమిటి? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా పురాణాల ప్రకారం స్వర్గ లోకంలో ఉన్న దేవతలందరూ కలిసి ఒకసారి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు దేవతలందరూ పార్వతీ పరమేశ్వరులను ఎటువంటి కార్యం తలపెట్టిన కూడా విఘ్నాలు కలగకుండా పూజించడం కోసం ఒక దేవుడిని నియమించండి అని వేడుకున్నారు. ఇక అదే సమయంలో అక్కడ ఉన్న పార్వతి తనయుడు మేము అర్హులము అని పోటీగా ముందుకు రాగా ఆ పరమేశ్వరుడు వారిద్దరికీ ఒక పోటీ పెడతాడు. అప్పుడు ఆ పోటీలలో ఎవరైతే విజయం సాధిస్తారో వారు అందుకు అర్హులు అని చెబుతారు. అందుకు వారు సరే అని అంటారు.

అప్పుడు ఆ పరమశివుడు మీలో ఎవరైతే లోకంలోని పుణ్య నదులలో స్నానం చేసి వస్తారు. వారు ఇందుకు అర్హులు అని చెప్పగా వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిని తీసుకొని ముల్లోకాలనే నదులను సందర్శించడానికి వెళ్తాడు. అప్పుడు వినాయకుడు ఇది నాకు ఎలా సాధ్యం తండ్రి అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి నారాయణ మంత్రాన్ని జపించమనీ చెబుతాడు. ఒక్కసారి ఆ మంత్రాన్ని జపిస్తే 300 కల్పాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది అని తెలపడంతో. వెంటనే వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు ప్రదక్షణలు చేసి నారాయణ అన్న మంత్రాన్ని జపిస్తాడు.

అప్పుడు కార్తికేయడం ముల్లోకాలు అన్ని తిరిగి కైలాసం చేరుకునే లోపే అక్కడ వినాయకుడు ఉండడని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు చింతించి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని చెబుతాడు. ఆ విధంగా భాద్యపద శుద్ధ చతుర్థి నాడు గణనాథుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. అయితే ఈ విధంగా ఎవరైతే శుభకారం తలపెట్టేముందు వినాయకుడి పూజ చేస్తారో ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అని భావించి వినాయకుడి పూజ చేస్తారు. ఆ విధంగా వినాయక చవితి రోజున వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు చేసి రకరకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి, వినాయకుడి కథను చదువుతూ ఈ పండుగను జరుపుకుంటారు.