Reproductive Crisis: చంద్ర‌బాబుదే నిజం! మ‌గాళ్ల‌కు డేంజ‌ర్!!

`ఒక‌రు ముద్దు ఇద్ద‌రు హ‌ద్దు ముగ్గురు వ‌ద్దు..` అనేది చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఉండ‌గా 2004లోని అధికారిక స్లోగ‌న్‌. సీన్ క‌ట్ చేస్తే, 2014-2019 మ‌ధ్య విభ‌జ‌న ఏపీకి చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా పిల్ల‌ల్ని ఎక్కువ మందిని క‌నండి. రాబోవు రోజుల్లో జ‌నాభా సంఖ్య అనూహ్యంగా త‌గ్గిపోతుంద‌ని చంద్ర‌బాబు ప‌లు సంద‌ర్భాల్లో సూచించారు. ఆయ‌న చెప్పింది అక్ష‌రాల నిజ‌మ‌ని ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నంలో తాజాగా తేలింది.

  • Written By:
  • Updated On - November 16, 2022 / 02:46 PM IST

`ఒక‌రు ముద్దు ఇద్ద‌రు హ‌ద్దు ముగ్గురు వ‌ద్దు..` అనేది చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉండ‌గా 2004లోని అధికారిక స్లోగ‌న్‌. సీన్ క‌ట్ చేస్తే, 2014-2019 మ‌ధ్య విభ‌జ‌న ఏపీకి చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా పిల్ల‌ల్ని ఎక్కువ మందిని క‌నండి. రాబోవు రోజుల్లో జ‌నాభా సంఖ్య అనూహ్యంగా త‌గ్గిపోతుంద‌ని చంద్ర‌బాబు ప‌లు సంద‌ర్భాల్లో సూచించారు. ఆయ‌న చెప్పింది అక్ష‌రాల నిజ‌మ‌ని ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నంలో తాజాగా తేలింది.

పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య వేగంగా ప‌డిపోతున్నాయ‌ని సైంటిస్ట్ లు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని 250 అధ్యయనాల సమాచారాన్ని క్రోడీకరించి ఆ ఫలితాలను వెల్లడించారు. గత ఐదు దశాబ్దాల కాలంలో ఒక మిల్లీ లీటర్ వీర్యంలో వీర్య కణాల సంఖ్య 104 మిలియన్ల నుంచి 49 మిలియన్లకు తగ్గింది. అంతేకాదు, వీర్యకణాల కాన్సంట్రేషన్ కూడా క్షీణిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. 1973 నుంచి 2000 మధ్య పురుషుల్లో వీర్య కణాల సంఖ్య 1.2 శాతం మేర తగ్గగా, 2000 నుంచి 2018 మధ్య 2.6 శాతం (రెట్టింపు) క్షీణంచినట్టు అధ్యయనానికి ముఖ్య పరిశోధకుడిగా వ్యవహరించిన హాగీ లెవెనే ప్ర‌క‌టించారు.

వీర్య క‌ణాల క్షీణ‌త‌కు కార‌ణాలు
మానవ తయారీ రసాయనాల ప్రభావాలకు గురికావడం, ఒత్తిళ్లు, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక చర్యలు లోపించడం, పొగతాగడం, స్థూలకాయం త‌దిత‌రాలు వీర్యకణాలను తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు వల్ల హార్మోన్లలో మార్పులు వస్తాయని, పురుషుల శరీరాల్లో మరింత ఈస్ట్రోజన్ చేరుతుందని చెబుతున్నారు. పురుషుల పునరుత్పాదక భాగంలో అధిక ఫ్యాట్ ఉండడం వల్ల అక్కడ వేడి పెరిగి, అది వీర్య కణాల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందంటారు. అందుకే సంతానం కలగని దంపతుల్లో పురుషులను బిగుతైన లోదుస్తులు ధరించొద్దని వైద్యులు సూచిస్తుంటారు.

పరిష్కారాలు ఇలా…
వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. శారీరక వ్యాయామాన్ని రోజువారీ జీవనంలో భాగం చేసుకోవాలి. మద్యం, పొగతాగడానికి దూరంగా ఉండాలి. బిగుతైన లో దుస్తులు ధరించకూడదు. ముఖ్యంగా కింది భాగంలో వేడి పెరగకుండా చూసుకోవాలి.

మొత్తం మీద పురుషుల్లో వేగంగా క్షీణిస్తోన్న వీర్య క‌ణాల సంఖ్య జ‌నాభా సంఖ్య‌ను త‌గ్గించ నుంది. వీర్య క‌ణాల సంఖ్య ప‌డిపోతోన్న క్ర‌మంలో పిల్లలు పుట్ట‌డం క‌ష్ట‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. అంటే, నాలుగేళ్ల క్రితం చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల‌ను ఆ రోజున జోక్ గా తీసుకున్న వాళ్లు ఇప్పుడు ప్ర‌పంచ శాస్త్రవేత్త‌లు చెప్పిన త‌రువాత సీరియ‌స్ గా ప‌రిగ‌ణించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.