Sex With Dead body : డెడ్ బాడీపై లైంగిక వేధింపులకు.. శిక్ష వేసే చట్టాల్లేవ్!

నెక్రో అంటే డెడ్ బాడీ .. ఫీలియా అంటే అట్రాక్షన్!! డెడ్ బాడీని చూసి అట్రాక్ట్ అయి, దానిపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిపే మానసిక స్థితిని నెక్రోఫీలియా(Sex With Dead body) అంటారు.  దీన్ని నేరంగా పరిగణించే చట్టాలు ప్రస్తుతానికి మన దేశంలో లేవు.

  • Written By:
  • Updated On - June 4, 2023 / 11:20 AM IST

Sex With Dead body : నెక్రోఫీలియా.. 

ఇప్పుడు దీనిపై హాట్ డిబేట్ నడుస్తోంది.. 

ఈ అంశంపై ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డిస్కషన్ జరుగుతోంది..  

ఇంతకీ నెక్రోఫీలియా అంటే ఏమిటి ? నెక్రోఫాగియా అంటే ఏమిటి ?  ఇప్పుడు తెలుసుకుందాం..

నెక్రో అంటే డెడ్ బాడీ .. ఫీలియా అంటే అట్రాక్షన్!! డెడ్ బాడీని చూసి అట్రాక్ట్ అయి, దానిపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిపే మానసిక స్థితిని నెక్రోఫీలియా(Sex With Dead body) అంటారు.  దీన్ని నేరంగా పరిగణించే చట్టాలు ప్రస్తుతానికి మన దేశంలో లేవు. ఇటీవల ఒక నెక్రోఫీలియా కేసుపై తీర్పు ఇచ్చే సందర్భంగా కర్ణాటక  హైకోర్టు  కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ” స్త్రీల మృతదేహంపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగితే శిక్షలు విధించే ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)  నిబంధనలు కానీ..  చట్టం కానీ ప్రస్తుతం మన దేశంలో లేవు. అయితే, నెక్రోఫిలియాను నేరంగా పరిగణించేలా కేంద్రం చట్టాన్ని సవరించాలి. ఐపీసీ సెక్షన్ 377 నిబంధనలను సవరించడానికి ఇదే సరైన సమయం” అని జస్టిస్ బి వీరప్ప, వెంకటేష్ నాయక్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి తగిన చట్టాలు లేవు కాబట్టి.. మన దేశంలో నెక్రోఫిలియాను అత్యాచారంగా పరిగణించరు.

Also read :Actress Aarti Mittal Arrested: అవకాశాల కోసం వస్తున్న మోడల్స్‌తో సెక్స్ రాకెట్‌.. నటి ఆర్తి మిట్టల్ అరెస్ట్

కర్ణాటక హైకోర్టులో కేసు ఏమిటి ?

2015  జూన్ 25న  21 ఏళ్ల మహిళ తన కంప్యూటర్ క్లాస్ ను ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. నిందితుడు రంగారావు ఆమెను పట్టుకుని, నోరు మూసి, సమీపంలోని పొదలోకి లాగాడు. దీని తరువాత అతను మహిళ గొంతు కోసి హత్య చేశాడు. ఇది  సెక్షన్ 302 IPC కింద శిక్షార్హమైన నేరం. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీ పై  “రేప్” చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి నుంచి వాంగ్మూలం తీసుకుని చార్జిషీట్ దాఖలు చేశారు. నేరాన్ని పరిగణలోకి తీసుకున్న మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని సెషన్స్ జడ్జికి పంపారు.  నిందితుడిపై హత్య, అత్యాచారం నేరాలకు సంబంధించి IPC సెక్షన్ 302, 376 కింద అభియోగాలను మోపారు. సాక్ష్యాలను పరిశీలిస్తే, నిందితుడు హత్యకు పాల్పడ్డాడని.. బాధితురాలి శరీరంపై “రేప్” చేశాడని ప్రాసిక్యూషన్ సహేతుకమైన సందేహానికి అతీతంగా నిరూపించిందని సెషన్ న్యాయమూర్తి గుర్తించారు. నిందితుడికి కఠిన జీవిత ఖైదు, రూ.లక్ష జరిమానా విధించారు. హత్య చేసినందుకు రూ. 50,000 జరిమానా వేశారు..  మృతదేహంపై అత్యాచారం చేసినందు మరో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు  ఇంకో  రూ. 25,000 జరిమానా వేశారు. ఈ తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు దాఖలైంది.

ఐపీసీ 375, 377..  

IPCలోని సెక్షన్ 302 ప్రకారం హత్యకు పాల్పడినందుకు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలనే ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. అయితే డెడ్ బాడీని రేప్ చేసినందుకు శిక్షించేలా ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లో ఎటువంటి నిబంధన లేదని పేర్కొంది. రేప్ కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.కేవలం హత్య కేసులో శిక్ష అమలవుతుందని స్పష్టం చేసింది.  ఐపీసీలోని 375 సెక్షన్  అత్యాచారానికి సంబంధించినది.  ఐపీసీలోని 375 సెక్షన్  అసహజ నేరాలకు సంబంధించినది. “భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 375 మరియు 377లోని నిబంధనలను జాగ్రత్తగా చదవడం ద్వారా మృతదేహాన్ని మనిషిగా లేదా వ్యక్తిగా పిలవలేమని స్పష్టమవుతుంది. తద్వారా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375 లేదా 377లోని నిబంధనలు నిందితుడికి అప్లై కావు.. కాబట్టి డెడ్ బాడీ పై రేప్ కేసులో అతడిని శిక్షించలేం ’’ అని కోర్టు పేర్కొంది.

నెక్రోఫాగియా అంటే .. డెడ్ బాడీ మాంసాన్ని తినడం!!