Temples Closed: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు బంద్!

సూర్యగ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలను మంగళవారం మూసివేసినట్టు దేవాదాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

  • Written By:
  • Updated On - October 25, 2022 / 12:01 PM IST

సూర్యగ్రహణం కారణంగా తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను మంగళవారం మూసివేసినట్టు దేవాదాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం, ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, బాసర్‌లోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం మూతపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గ్రహణం కారణంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఉదయం మూసివేశారని, రేపు (బుధవారం) ఉదయం సంప్రోక్షణ, ఇతర పూజల అనంతరం తెరుస్తామని ఆలయ అధికారి తెలిపారు.

మంగళవారం హైదరాబాద్ తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం ప్రభావం కనిపిస్తోంది. నాగ్‌పూర్‌లో సాయంత్రం 4:49 నుండి సాయంత్రం 5:42 వరకు గ్రహణం కొనసాగుతుంది. బెంగళూరులో గ్రహణం సాయంత్రం 5:12 గంటలకు ప్రారంభమవుతుంది. గరిష్టంగా సాయంత్రం 5:49 గంటలకు చేరుకుంటుంది. సాయంత్రం 5:55 గంటలకు ముగుస్తుంది. చెన్నైలో సాయంత్రం 5:14 నుండి 5:44 వరకు గ్రహణం ఉంటుందని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేబీ ప్రసాద్ దువారీ తెలిపారు.