SBI Loans : వాయిదాలు ఎగ్గొట్టే వారికి చాకెట్లు ఇస్తున్న SBI..!

  • Written By:
  • Updated On - September 18, 2023 / 02:57 PM IST

అవసరానికి బ్యాంక్ ల నుంచి రుణాలు తీసుకుంటారు కానీ వాటి వాయిదాలు నెల వారి EMI లు కట్టేందుకు మాత్రం కొందరు అశ్రద్ధ చూపిస్తుంటారు. అయితే ఇలా లేట్ పే చేసే వారికి చెక్ బౌన్స్ చార్జ్ అని బ్యాంక్ లు వేసే అదనపు చార్జీలు తెలిసిందే. కానీ EMI వాయిదా ను టైం కు కట్టేందుకు లేటెస్ట్ గా SBI ఒక సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదేంటి అంటే వాయిదాలు ఎగ్గొట్టే అవకాశం ఉన్న వారికి చాక్లెట్లు పంపించి వాయిదా విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

దీనికొసం రెండు ఫిన్ టెక్ లతో SBI భాగస్వామ్యం కుదుర్చుకుందని తెలుస్తుంది. కృత్రిమ మేధ (AI) తో రుణ గ్రహితలకు వాయిదా గుర్తు చేసేలా రిమైండర్లు పంప్పించేలా ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేశారట. ఎవరైతే వాయిదా ఎగ్గొట్టే అవకాశం ఉందో వారిని గుర్తించి ఫిన్ టెక్ ఆ సమాచారం SBI కు తెలియచేస్తుందట. అప్పుడు బ్యాంక్ వారు EMI విషయాన్ని గుర్తు చేస్తూ రుణ గ్రహిత ఇంటికి చాక్లెట్లు పంపించి వాయిదా కట్టాలని గుర్తు చేస్తారట.

15 రోజుల క్రితం నుంచే SBI ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఇది సక్సెస్ అయితే అధికారికంగా ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల అప్లై చేస్తామని అంటున్నారు. 4 నుంచి 5 నెలల పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తామని అంటున్నారు. SBI ప్రవేశ పెడుతున్న ఈ చాక్లెట్ల సిస్టెం క్లిక్ అయితే అన్ని బ్యాంక్ లు కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

SBI బ్యాంక్ క్రెడిట్ బుక్ లో 2023 జూన్ ముగిసే సరికి త్రైమాసికం లో 10.34 లక్షల కోట్ల నుంచి 12.04 లక్షల కోట్లకు చేరుకుంది. టోటల్ గా SBI బ్యాంక్ క్రెడిట్ బుక్ లో 33,03,731 కోట్లతో అధిక వాటా రిటైల్ రుణాలదేనని బ్యాంక్ వెల్లడించింది.

Also Read:  Unnao: గర్భిణీ మహిళ న్యాయవాది ప్రమాదశావత్తు వాగులో పడి మృతి