G.O.111:హైదరాబాద్ శివారు భూములు బంగారమే..జీవో111 ఎత్తివేత…!!

జీవో 111. ఈ పేరు ప్రస్తావనకు రాగానే ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అలజడి మొదలవుతుంది. లక్ష 32వేల ఎకరాల జమీన్ కహానీ ఈ జీవో 111. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్దమనుషులు భారీగా పెట్టుబడులు పెట్టారు.

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 09:05 PM IST

జీవో 111. ఈ పేరు ప్రస్తావనకు రాగానే ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అలజడి మొదలవుతుంది. లక్ష 32వేల ఎకరాల జమీన్ కహానీ ఈ జీవో 111. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్దమనుషులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ జీవో ఎత్తివేస్తే..ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులనే క్రియేట్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 1,32,000ఎకరాల్లో ఈ జీవో విస్తరించి ఉంది. హైదరాబాద్ మహానగర శివారులో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్ మండలాలు పూర్తిగా వికారాబాద్ జిల్లాలోని శంకర్ పల్లి, చేవెళ్ల, షాద్ నగర్, షాబాద్ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు జీవో 111 పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు ఈ జీవో 111ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా హైదరాబాద్ పట్టణానికి తాగునీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సార్, హిమాయత్ సాగర్ ను కాపాడేందుకు అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం. వ్యవసాయ రంగానికి తప్పా ఎలాంటి భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 111 జీవోను ఎత్తివేస్తామని రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు ఇచ్చాయి. దీంతో 111 జీవో పరిధిలో భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయి.

ఇప్పటికే అక్కడ వందల సంఖ్యలో ఫాంహౌజ్ లు వెలిసాయి. విల్లాలను నిర్మించారు. భూ క్రయవిక్రయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ వేదిక సంచలన ప్రకటన చేశారు. జీవో 111 పరిధిలో 1,32,600ఎకరాల భూమిని గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చినట్లు చెప్పారు. అయితే హైదరాబాద్ నగరానికి ఈ జలాశయాలు నీరు ఇఫ్పుడు అవసరం లేదని…ఇంకో వందేళ్ల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదని…ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ జీవో 111ను ఎత్తివేసేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో 111జీవో పరిధిలో ఉన్న భూములు బంగారం కానున్నాయి.