టీవీ9 రజనీకాంత్ (TV9 Rajinikanth ) సోషల్ మీడియా(Social Media)లో ముడిసరుకుగా ఎందుకు మారాడు. వరుసగా రకరకాల వివాదాలు తెరపైకి ఎందుకు వస్తున్నాయి. ఆర్గనైజ్డ్‌గా కొంత మంది వ్యక్తులు…వాళ్లకు కొన్ని పార్టీలు ఇందుకు సహకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తుమ్మినా..దగ్గినా..మాట్లాడినా, మాట్లాడకపోయినా…అన్నిటికీ జిందా తిలిస్మాన్ తరహాలో రజనీకాంత్ బాధ్యుడవుతున్నాడు. ఇది ఏ స్థాయికి వెళ్లింది అంటే…వ్యక్తిగతమైన దాడులతో సోషల్ మీడియా పోస్టులు చేయడం ఆసక్తికరం.
నేరుగా విషయంలోకి….
27 ఏళ్లుగా జర్నలిజం (Journalism) కెరియర్లో ఉన్నారు రజినీకాంత్. మచ్చలేని వ్యక్తిగా ఉన్న రజనీకాంత్ పై ఏనాడు ఆరోపణలు రాలేదు. కానీ ఇప్పుడే పాత మేనేజ్ మెంట్ మారిన తర్వాత ఆరోపణలు రావడం అనేది గమనించాల్సిన అంశం. రజనీ ఏం చేసినా..చేయకపోయినా వివాదాలు చుట్టుముడుతున్నాయి.నిరాధారమైన ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎవరిమీద అయినా ఎప్పుడో ఒకసారో రెండుసార్లో ఆరోపణలు వస్తాయి. కానీ ఇక్కడ రోజు వారీ దాడులు రజనీకాంత్‌పై జరుగటం గమనిస్తున్నాం.
ఎవరీ రజినీకాంత్ (Who is Rajinikanth) :
వెల్లలచెరువు రజనీకాంత్ అంటే చాలామందికి తెలియదు. కానీ… TV9 రజనీకాంత్ అంటే ప్రతిఒక్కరికి సుపరిచితుడే. ప్రస్తుతం టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్ మేనేజింగ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో రజనీకాంత్ కి తనకంటూ ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి. 20 ఏళ్లగా తెలుగురాష్ట్రాల్లో జరిగిన అనేక పరిణామాల్లో రజనీకాంత్ సాక్షి భూతంగా నిలిచి మీడియా పరంగా చరగని ముద్ర వేసాడు అనటంలో సందేహం లేదు.
పొలిటికల్ డిబేట్స్ నిర్వహించడంలో రెచ్చకొట్టే తరహాలో చర్చలు చేయడంలో దిట్ట. అతను చేసిన అనేక చర్చలు పలు సందర్భాల్లో వివాదస్పదం కూడా అయ్యాయి. గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతారని.. డిబేట్స్‌లో వ్యక్తుల మధ్య గొడవలు సృష్టించి రేటింగ్స్ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తారని అతనిమీద విమర్శలున్నాయి. అయినప్పటికీ అతని డిబేట్లకు పాలోయింగ్ ఉంది. చిన్న పట్టణం నుంచి వచ్చినా రజనీకాంత్‌లో ఉన్న ఆత్మవిశ్వాసం ..ఆయనలో ఉన్న ధైర్యం, తెగింపు లక్షణాలు మరింత పాపులర్ చేసాయి. రాజకీయ ఇంటర్వ్యూలు…విమర్శనాత్మక విశ్లేషణలు చేయడంలో రజనీకాంత్ దిట్ట. అందుకే రజనీకాంత్ ఇంటర్వ్యూ అంటే భయపడేవారు ఉంటారు..ఇష్టపడే వారు ఉంటారు.
రజనీకాంత్ (Rajinikanth) బాల్యం – చదువు
వెల్లలచెరువు రజనీకాంత్ 1975లో గుంటూరులో జన్మించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995లో వార్తా పత్రికలో జర్నలిస్టుగా కెరీర్‌ని ప్రారంభించారు రజనీకాంత్. మూడేళ్లు వార్తలో రిపోర్టర్‌గా పనిచేసారు. ఆ తర్వాత సిటీ కేబుల్ ఛానెల్‌లో ఐదేళ్లు పనిచేసారు.
We’re now on WhatsApp. Click to Join.
టీవీ-9లో రజనీ చేరిక…
2003లో రజనీకాంత్ TV9లో పొలిటికల్ రిపోర్టర్‌గా చేరాడు. రిపోర్టర్ స్థాయి నుంచి మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు. కాలక్రమేణా TV9కి ప్రధాన ముఖంగా మారాడు. ఓపెన్ ఫోరమ్, క్వశ్చన్ అవర్, న్యూస్ టునైట్, 9 PM లైవ్ షో, , బిగ్ న్యూస్ – బిగ్ డిబేట్, క్రాస్ ఫైర్ మొదలైన రాజకీయ చర్చలను నిర్వహించడంలో అతను ఘనాపాటి. టీవీ9లోనే 20ఏళ్లుగా అచెంలంచెలుగా ఎదుగుతూ తెలుగు రాష్ట్రాల్లోని పరిణామాలను గమనిస్తూ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నాడు రజనీకాంత్. జర్నలిజంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని..ఆ రంగంలోకి వారికి ఆదర్శంగా నిలిచాడు. తెలుగు రాష్టంలో అతనీ ప్రశ్నలు ఎదుర్కొనని రాజకీయ నాయకుడు లేడని చెప్పొచ్చు.
ఇప్పుడే ఎందుకు ఆరోపణలు..
గత నాలుగేళ్లుగా మాత్రమే రజనీకాంత్‌పై ఆరోపణలు వస్తున్నాయి. 24 ఏళ్ల పాటు ఎలాంటి మచ్చలేదు. టీవీ9 మేనేజ్ మెంట్ మారిన కొన్నాళ్ల తర్వాత ఇవి ఎక్కువయ్యాయి. ఎంతగా అంటే…వ్యక్తిగత దూషణలకు వెరవడం లేదు గిట్టని వాళ్లు. రోజు వాట్స్అప్ గ్రూప్స్ తిరుగుతున్న మెసేజ్లే నిదర్శనం. ఇందుకు కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తులు కొమ్ముకాస్తున్నారు. క్లిస్టల్ క్లియర్‌గా కావాలని సోషల్ మీడియాలో రజనీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.. కాదు కాదు పెట్టిస్తున్నారు అనటoలో సందేహం లేదు. ఇవి సర్వసాధారణం అనుకోవచ్చు కానీ ఒక క్రమబద్దంగా వ్యక్తిగతంగా జరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరితే పరిణామాలు ఊహించటం కష్టం గా ఉంది …జర్నలిస్టులకు అనేవాడు ఇలాంటి పరిస్తుతుల్లో పని చేయడం కత్తిమీద సాములానే మారుతోంది.
ఉద్యోగం..
సహజంగా ప్రతి ఛానల్లో మేనేజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా మాత్రమే ఏ సంస్థలోనైనా ఉద్యోగి పాత్ర ఉంటోంది. ఇది అందరికీ వర్తిస్తోంది. రజనీకాంత్ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. అలాటప్పుడు ఎందుకు రజినీకాంత్ టార్గెట్ అవ్వటానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. పాత మేనేజ్మెంట్ వెళ్లిపోనప్పుడు ఛానల్ నిలబెట్టి చూపించాడు. నాలుగు ఏళ్ళుగా చానల్ పరపతి పడిపోకుండా కాపాడటంతో పాటు..తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రయోగాలతో సరికొత్త పుంతలు తొక్కించడం చూస్తూనే ఉన్నాం. ఇది కొంతమందికి కంఠగింపుగా మారడంతోనే వివాదాల దాడి మొదలైందనే చర్చ సాగుతోంది. అది రోజు రోజుకు తీవ్రతరం చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. .
నేతల విమర్శలు…
మీడియాలో జర్నలిస్టులపై ఆరోపణలు రావడం కామన్. ఒక పార్టీ తమకు నచ్చినట్లు, తమకు అనుకూలంగా లేదా తాము చెప్పిన వారికి వ్యతిరేకంగా వార్తలు రాకపోతే వారికి రాజకీయ రంకును అంటగట్టే పరిస్థితులు ఉన్న కాలమిది. అయితే ఆరోపణలు శృతిమించి కక్ష కట్టి వ్యక్తిగతమైన దాడుల వరకు వెళుతున్న తీరు మాత్రం ఇబ్బందికరమే. బట్ట కాల్చి మీద వేసినట్లు వ్యవహరిస్తున్న తీరు ఇటు మీడియాకు అటు రాజకీయ వ్యవ్యస్థలకు మంచిది కాదు. ఏ జర్నలిస్ట్ కైనా ఇలాంటివి కొనసాగితే జర్నలిజంలో మచ్చలేకుండా నికార్సుగా పని చేయడం కష్టంగా మారుతుంది అనటంలో సందేహం లేదు. ఇన్ని సంఘర్షణల నడుమ రజనీకాంత్ తన నిజాయితీని నిరూపించుకున్ని జర్నలిస్ట్ ప్రయాణం కొనసాగిస్తున్నాడు.
Read Also : Serilingampally Jagadeeshwar Goud : మచ్చ లేని మహారాజు ‘జగదీశ్వర్ గౌడ్’
