Site icon HashtagU Telugu

Best Police Station: ఆదర్శం ‘రాజేంద్రనగర్’ పోలీస్ స్టేషన్, దేశంలోనే ది బెస్ట్!

Rajendra Nagar

Rajendra Nagar

Best Police Station: సైబరాబాద్ కమిషనరేట్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ భారతదేశంలోనే ఉత్తమమైనదిగా ఎంపికైంది, ట్రైసిటీ కమిషనరేట్‌ల నుండి ఒక పోలీసు స్టేషన్‌కు ఇటువంటి గౌరవం లభించడం ఇదే మొదటిసారి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన 58వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్స్-జనరల్ మరియు ఇన్‌స్పెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బి. నాగేంద్ర బాబుకు ఈ అవార్డును అందజేశారు.

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, సిబ్బందిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రవి గుప్తా అభినందించారు. “హార్టీ కంగ్రాట్స్” అంటూ ఈవెంట్ ఫోటోతో పాటు ఎక్స్‌ లో పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఘనత రాజేంద్రనగర్ పోలీసుల అంకితభావం, కృషికి అద్దం పడుతుందని డీజీపీ రవిగుప్తా అన్నారు. నాగేంద్రబాబును అభినందిస్తూ “సమాజానికి సేవ చేయడం, చట్టాన్ని పరిరక్షించడంలో వారి నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకం” అని గుప్తా పేర్కొన్నారు.

ఎంపిక ప్రక్రియలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (CCTNS) ద్వారా మూల్యాంకనం ఉంటుంది. భారతదేశంలోని 17,000 పోలీస్ స్టేషన్‌ల నుండి 75 స్టేషన్‌లు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. ఎంపిక కోసం ప్రమాణాలు నేర గుర్తింపు రేటు, దర్యాప్తు నాణ్యత, మౌలిక సదుపాయాల నిర్వహణ మరియు మానవ హక్కుల మార్గదర్శకాలు ఇలా అన్నింట్లో ముందుంది.

పోలీస్‌ శాఖకు టెక్నాలజీని జోడించడంలో హైదరాబాద్ పోలీసుల చొరవ అభినందనీయమ చెప్పాలి. పోలీసింగ్‌లో వచ్చిన మార్పులు ఏమిటన్నది కానిస్టేబుళ్లకు అందిస్తున్న పరికరాల్ని చూస్తే అర్థమవుతుందన్నారు. గతంలో మావోయిస్టుల ప్రభావం కారణంగా పోలీసుల చేతిలో ఆటోమేటిక్‌ రైఫిల్స్‌ ఉండేవని, వాటి స్థానంలో ఇప్పుడు ట్యాబ్‌లు, సీసీ కెమెరాలు వచ్చి చేరాయన్నారు. గత మాజీ డీజీపీలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రజలకు నాణ్యమైన పోలీస్‌ సేవలు అందించేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో పోలీస్‌ శాఖను అగ్రస్థానంలో ఉంచారు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ దేశానికే తలమానికంగా నిలుస్తోందని ఇప్పటికే చాలామంది అభిప్రాయ పడ్డారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా పోలీస్ శాఖను పీపుల్‌ ఫ్రెండ్లీగా మార్చడంలో పూర్తిస్థాయిలో సహకారం అదించింది. అందుకే మన పోలీస్ స్టేషన్లు ది బెస్ట్ నిలుస్తున్నాయని నగర ప్రజలు అంటున్నారు.