Rajamouli Sentiment : రాజమౌళి సెంటిమెంట్ ను ఏ హీరో బ్రేక్ చేయలేరా..?

Rajamouli Sentiment Fear in Fans : రాజమౌళి ట్రాక్ రికార్డు బాగున్నప్పటికీ..రాజమౌళి తో సినిమాలు చేసిన తర్వాత ఆయా హీరోల ట్రాక్ రికార్డు మాత్రం డిజాస్టర్ గా ఉంటుంది

Published By: HashtagU Telugu Desk
Rajamouli Sentiment

Rajamouli Sentiment

అంటే ఖచ్చితంగా చేయలేరనే చెప్పాలి. స్టూడెంట్ నెం 1 (Student No 1) దగ్గరి నుండి మొన్నటి RRR వరకు ప్రతి హీరో నెక్స్ట్ సినిమాలు ప్లాప్స్ కావలిసిందే. చిత్రసీమలో ప్లాప్ అంటే తెలియని డైరెక్టర్ రాజమౌళి (Rajamouli). ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ (Movies) బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు కావడమే కాదు ఆయా హీరోల రేంజ్ ను పెంచిన సినిమాలు..టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసిన సినిమాలు. అలాంటి ట్రాక్ రికార్డు రాజమౌళికి సొంతం. జక్కన్న సినిమాలు ఇప్పటి వరకు లెక్క తప్పలేదు. ఆలస్యం అవుతాయనే టాక్ మినహా ఏ ఇబ్బంది లేదు ఆయన సినిమాలకు. రాజమౌళి ట్రాక్ రికార్డు బాగున్నప్పటికీ..రాజమౌళి తో సినిమాలు చేసిన తర్వాత ఆయా హీరోల ట్రాక్ రికార్డు (Heros Track record) మాత్రం డిజాస్టర్ (Disaster ) గా ఉంటుంది.

రాజమౌళి తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్ తో ఎంత మంచి కథ తో చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ప్లాప్ అవ్వాల్సిందే. స్టూడెంట్ నెం 1 తో ఎన్టీఆర్ (NTR) సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడ్డాయి. రామ్ చరణ్ (Ram Charan) విషయంలో కూడా ఇదే జరిగింది. మగధీర తో మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న..ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ కాదు కదా..కనీసం హిట్ కొట్టడానికి కూడా చాల సమయమే పట్టింది. ప్రభాస్ (Prabahs) కూడా అంతే..రాజమౌళి తో ఛత్రపతి చేసాడు..ఆ తర్వాత వరుస ప్లాప్స్ అందుకున్నాడు. రవితేజ (Raviteja) , సునీల్ (Sunil) , నాని (Nani) ఇలా అందరు కూడా రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయారు.

ఇప్పుడు దేవర (Devara) పరిస్థితి కూడా అదే అంటున్నారు సినీ జనాలు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ళ పాటు గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవర సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా విడుదల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారు. తీరా చూస్తే సినిమా దారుణంగా ఉందనే టాక్ నడుస్తుంది. సినిమాలో పెద్దగా ఆకట్టుకునేవి ఏమీ లేవని పెదవి విరుస్తున్నారు. సినిమా చూడక ముందే బయటకు వచ్చేస్తున్నారు కొందరు. దీనితో రాజమౌళి సెంటిమెంట్ ని తప్పించడం ఎవరి తరం కాదంటున్నారు జనాలు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్ తో రామ్ చరణ్ బయటపడ్డాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కు కీలకమైన దేవర దెబ్బకొట్టింది. దేవర సినిమాపై ఉన్న అంచనాలకు సినిమాలో చూపించిన దానికి ఏ మాత్రం సంబంధం లేదని, టైం తీసుకుని కూడా నాశనం చేసారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. మొత్తం మీద రాజమౌళి సెంటి మెంట్ అనేది కొనసాగాల్సిందే అని అంటున్నారు.

ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఖంగారుపడుతున్నారు. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించబోయేది మహేష్ తోనే. దసరా కు ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం మహేష్ తన మేకోవర్ ను మార్చుకొని సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా మహేష్ ఖాతాలో ప్లాప్ చేరినట్లే అని ఇప్పటి నుండే ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

Read Also : Devara : దేవర ఫలితం.. బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ..

  Last Updated: 27 Sep 2024, 07:05 PM IST