Rahul Sipligunj : రతికపై రాహుల్ కామెంట్.. సింపతీ గేమ్ ఎప్పటివరకు అంటూ..!

బిగ్ బాస్ సీజన్ 7 లో రతిక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా హౌస్ లోకి వెళ్లింది. స్టేజ్ మీదే నాగ్ సర్ తో తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి

Published By: HashtagU Telugu Desk
Rahul Sipligunj Indirect Sa

Rahul Sipligunj Indirect Sa

బిగ్ బాస్ సీజన్ 7 లో రతిక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా హౌస్ లోకి వెళ్లింది. స్టేజ్ మీదే నాగ్ సర్ తో తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి మొత్తం మీరే చేశారంటూ చెప్పిన రతిక ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేసింది. అయితే ఆమె హౌస్ లోకి వెళ్లాక అర్ధమైంది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 4 రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె లవ్ స్టోరీ బ్రేకప్ అయ్యిందని రాహుల్ ఆ సీజన్ లో హౌస్ లో పునర్నవి తో క్లోజ్ అవడం వల్లే వాళ్లు విడిపోయారని తెలుస్తుంది. అయితే రతిక వెళ్లిన ఫస్ట్ డే నుంచి తన ఆట మొదలు పెట్టింది. రీసెంట్ గా మాయాస్త్ర టాస్క్ లో గౌతం కృష్ణ, దామినిలతో ఫైట్ చేసింది.

ఆ టాస్క్ విషయంలో హౌస్ మెట్స్ అందరినీ దాదాపు గంటల పాటు వెయిట్ చేయించింది రతిక. ఇదిలాఉంటే రీసెంట్ గా హౌస్ లో కాస్త లో గా ఫీల్ అవుతున్న ఆమెను శివాజి ఓదార్చగా తనకు ఎక్స్ గురించి ప్రస్తావించింది. ఇక్కడ అందరికీ అతని గురించి చెప్పానని అన్నది రతిక. అయితే శివాజి మన పర్సనల్స్ ఎవరితో పంచుకోకూడదని సలహా ఇచ్చాడు. హౌస్ లో వచ్చీరాగానే పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా మూవ్ అయిన రతిక ఇప్పుడు అతన్ని పక్కన పెట్టి ప్రిన్స్ యావర్ తో క్లోజ్ గా మూవ్ అవుతుంది.

హౌస్ లో ఆమె చేస్తున్న విషయాల మీద లేటెస్ట్ గా రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj ) స్పందించాడు. తన సోషల్ మీడియా పేజ్ లో ఒక కామెంట్ పెడుతూ సింపతీ గేం ఎన్నాళ్లని ఆడతారని అన్నారు. అంతేకాదు తన పేరుని వాడుకుంటున్నారని. తమ ప్రతి చూపించడం మానేసి ఇతరుల మీద ఆధారపడతారని. ఇలా చేస్తున్న ఇన్నర్ పర్సన్ ఆమెను ప్రమోట్ చేస్తున్న బయట టీం కు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు రాహుల్ సిప్లిగంజ్. అంతేకాదు పర్సనల్ ఫోటోలు ఫోన్ లో నుంచి ఎలా లీక్ అయ్యాయి అది కూడా ఆరేళ్ల తర్వాత ఇదంతా కూడా ప్రీ ప్లాండ్ గా చేసిందని కాకపోతే హౌస్ లో ఉన్నప్పుడే ఎందుకు ఇవి సోషల్ మీడియాలోకి షేర్ చేశారంటూ ఇన్ స్టా స్టేటస్ లో రాహుల్ రతిక టీం చేస్తున్న విషాయల మీద క్లారిటీ ఇచ్చారు.

తన పేరు వాడుకుని బిగ్ బాస్ ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తుందని గమనించాలని రాహుల్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి రాహుల్ (Rahul Sipligunj ) కామెంట్ హౌస్ లో ఉన్న రతిక మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి.

Also Read : BiggBoss7 : అతన్ని హీరో చేస్తున్న కంటెస్టెంట్స్..!

  Last Updated: 21 Sep 2023, 11:33 AM IST