Site icon HashtagU Telugu

Virat Kohli: 9వ తరగతి ఎక్సామ్ లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. వైరల్ వైరల్

virat kohli

virat kohli

Virat Kohli : పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ.. భారత్ నుంచి గొప్ప క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకడు. ఇప్పటి వరకు దేశం తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. టీమిండియాకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. అలాంటి విరాట్ కోహ్లీ గురించి 9వ తరగతి పరీక్షా ప్రశ్నా పత్రంలో ఓ ప్రశ్న సంధించారు. క్రీడల పట్ల విద్యార్థుల్లో అవగాహన, జీకేని ప్రశ్నిస్తున్నట్టు ఇది తెలుస్తోంది.

ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ ఫొటోని ఉంచి, దీనిపై 100-120 పదాల్లో డిస్క్రిప్షన్ రాయాలని కోరారు. ఈ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఇది పెద్ద వైరల్ గా మారింది. కోహ్లీకి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో కోహ్లీ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘దీన్నే సక్సెస్ అంటారని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ ఇమేజ్ పై నేను ఒక పుస్తకమే రాస్తాను. ఈ ఫొటో చూసి చెప్పేందుకు ఎంతో ఉంది’’ అని పేర్కొన్నాడు

Also Read:  Planets: మర్చి 28న రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఒకేసారి ఐదు గ్రహాలు మనకు కనిపించబోతున్నాయి..