Site icon HashtagU Telugu

AP : చంద్రబాబుని అరెస్ట్ చేసి.. జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడబోతున్నాడా..?

Protest Against Chandrababu

Protest Against Chandrababu

అంటే అవుననే అంటున్నాయి రాజకీయ సమీకరణాలు. చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేస్తే..మనకు తిరుగుండదు..జనాలు పెద్దగా పట్టించుకోరు..టీడీపీ (TDP) నేతలు సైతం సైలెంట్ అవుతారు..మరో ఆరు నెలలు బాబు ను జైల్లోనే ఉంచుదాం..అప్పటిలోపు ఎన్నికలు పూర్తి అవుతాయి..అధికారం మళ్లీ మనదే..మరోసారి అధికారం వచ్చాక మళ్లీ వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేదు.. ఇలా వైసీపీ ప్లాన్ చేసింది..కానీ ప్లాన్ రివర్స్ అయ్యిందా..? అంటే అవుననే చెప్పాలి.

చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో వార్ వన్ సైడ్ అయినట్లు అయ్యింది. చంద్రబాబు అరెస్ట్ తో ఆ రెండు రోజులు రాష్ట్ర ప్రజలు సైలెంట్ అయ్యారు. అసలు ఏంటి ఈ కేసు..? ఈ కేసుకు చంద్రబాబు కు ఎంత వరకు సంబంధం ఉంది..? ప్రభుత్వ ఆరోపణల్లో నిజం ఎంత..? అనేది తెలుసుకున్నారు. ఆ తర్వాత అసలు ఈ స్కిల్ డెవలప్ మెంట్ లో స్కామే జరగలేదని పక్క ఆధారాలతో టీడీపీ బయటపెట్టింది. అసలు చంద్రబాబు కు సంబంధం లేని కేసులో ఆయన పేరు పెట్టారని ప్రజలు తెలుసుకున్నారు. కేవలం జగన్ సర్కార్ కక్ష్య సాధింపు లో భాగంలోనే అరెస్ట్ చేసిందని గమనించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..బాబు కు సపోర్ట్ గా నిలువడం..నేనున్నాను అంటూ ముందుకు రావడం..రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం..ఇవన్నీ కూడా టీడీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెంచేలా చేసాయి.

ఇక ఎక్కడ తగ్గేదెలా అని వారంతా డిసైడ్ అయ్యి..చంద్రబాబు కు సంఘీభావం తెలిపేందుకు రోడ్ల పైకి రావడం మొదలుపెట్టారు. చంద్రబాబు కు జరిగిన అన్యాయం ఫై ప్రశ్నించడం చేయడం స్టార్ట్ చేసారు. ఐయామ్ విత్ బాబు (I AM WITH CBN) అంటూ పదులు , వందలు , వేల సంఖ్యలో పెద్దవారు చిన్నవారు , సామాన్య ప్రజలు , ఉద్యోగస్తులు , కార్ డ్రైవర్స్ ఇలా వారు , వీరు అనే తేడాలు లేకుండా అంత సపోర్ట్ గా నిలుస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు విదేశాల్లోనూ చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. తెలంగాణలో ఖమ్మం, మధిర, నిజామాబాద్, కోదాడ వంటి ప్రాంతాల్లోనూ ర్యాలీలు జరగడం ఆశ్చర్యకరంగా మారింది. ఏపీలో నిర్బంధాల వల్ల పెద్దగా బయటకు రాని ప్రజలు శనివారం మాత్రం.. ర్యాలీలతో హోరెత్తించారు.

Read also : 75 Years Parliament Journey : 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం.. 5 ముఖ్యమైన పాయింట్లు ఇవే

విజయవాడ, గుంటూరుల్లో రెండు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న నిరసనలు టీడీపీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. మహిళలు ముందు ఉండి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఓపక్క పోలీసులు అడ్డుకున్నా ఆగడంలేదు. గుంటూరులో నిర్వహించిన ప్రదర్శన ముందుగా ప్రీప్లాన్డ్ కాదు. కొంత మంది అలా రోడ్డుపైకి వచ్చారు. తర్వాత విస్తృతంగా ప్రచారం జరగడంతో.. అలా వెంటనే మహిళలంతా రోడ్డుపైకి మద్దతుగా వచ్చారు. ఈ స్పందన అనూహ్యమని.. ఇది రాష్ట్రమంతా పాకితే.. ప్రజాఉద్యమం వస్తుందని ఇది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేసి వారం రోజులు అవుతోంది. ఓ వైపు స్కిల్ కేసులో ఆధారాలు లేవన్న ప్రచారం బలపడుతూండటం.. మరో వైపు చంద్రబాబు చేసిన పనులను టీడీపీ విస్తృతంగా చేస్తూండటంతో ఆయనపై సానుభూతి రోజురోజుకు పెరుగుతుంది. ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ పెద్ద మైనస్ గా మారబోతున్నాయి. ఇదే విషయాన్నీ వైసీపీ (YCP) నేతలు సైతం లోలోపల మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం .. అదీ కూడా ఆయనను వేధించినట్లుగా అరెస్ట్ చేయడం వల్ల టీడీపీ పార్టీకి అనసవరంగా చాన్సిచ్చామన్న భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. చంద్రబాబుకు రోజు రోజుకు విపరీతంగా సానుభూతి పెరుగుతుంది. ఇదిలాగే కొనసాగితే ఇక డిపాజిట్ కూడా రాకపోవచ్చని భయపడుతున్నారు. మొత్తం మీద జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని ప్రతి ఒక్కరు అంటున్నారు.