All About YashoBhoomi : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు. ఈసందర్భంగా ఆయన ఒక గొప్ప గిఫ్ట్ ను దేశానికి ఇవ్వబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక సెక్టార్ లో దాదాపు రూ.5వేల కోట్ల బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ (ఐఐసీసీ) ‘యశోభూమి’ని ఇవాళ ఆయన ప్రారంభించి, జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ గా రికార్డును క్రియేట్ చేయబోతోంది. ఈసందర్భంగా యశోభూమికి సంబంధించిన 10 ఆసక్తికర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Also read : PM Modi Birthday: నేడు ప్రధాని పుట్టినరోజు.. నేడు మోదీ చేయబోయే కార్యక్రమాలు ఇవే..!
#WATCH | Visuals of 'YashoBhoomi' that Prime Minister Narendra Modi will dedicate to the nation at Dwarka on 17th September in Delhi. pic.twitter.com/j5D86ruHAv
— ANI (@ANI) September 16, 2023
- యశోభూమి నిర్మాణ బడ్జెట్ దాదాపు రూ.5400 కోట్లు
- దీన్ని ఢిల్లీలోని ద్వారక ఏరియాలో 73 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మించారు.
- యశోభూమిలో మెయిన్ ఆడిటోరియంతో పాటు మొత్తం 15 కన్వెన్షన్ హాల్స్, ఓ బాల్ రూమ్, మరో 13 మీటింగ్ రూమ్స్ ఉన్నాయి.
- యశోభూమిలోని అన్ని గదుల్లో కలుపుకొని మొత్తం 11 వేల మంది ఏకకాలంలో కూర్చోవచ్చు.
- ఇందులోని మెయిన్ ఆడిటోరియంలో 6 వేల మంది కూర్చోవచ్చు. బాల్ రూమ్ లో 2,500 మంది కూర్చోవచ్చు.
- యశోభూమి ఆవరణలో 34,808 వాహనాలను పార్క్ చేయొచ్చు.
- యశోభూమిలో వీవీఐపీ లాంజ్‌లు, క్లోక్ సౌకర్యాలు, సందర్శకుల సమాచార కేంద్రం, టికెటింగ్ కౌంటర్లు వంటి బహుళ సహాయక ప్రాంతాలు కూడా ఉన్నాయి.
- యశోభూమిలో 100% వ్యర్థ జలాల పునర్వినియోగం జరుగుతుంది. రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ చేస్తారు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లు అమర్చారు. మురుగునీటి శుద్ధి వ్యవస్థలు ఉన్నాయి.
- యశోభూమి క్యాంపస్ కు CII యొక్క ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినం సర్టిఫికేషన్ లభించింది.
- ఇవాళ ద్వారకా సెక్టార్ 25 వద్ద కొత్త మెట్రో స్టేషన్ ను కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. అంటే ఇక్కడికి వచ్చే వారికి దగ్గరిలోనే మెట్రో అందుబాటులోకి వస్తుంది.
- ద్వారకా సెక్టార్ 21 ఏరియా నుంచి ‘యశోభూమి’ ఉన్న ద్వారకా సెక్టార్ 25 ఏరియా వరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపు పనులను (All About YashoBhoomi) కూడా ఇవాళ మోడీ ప్రారంభిస్తారు.