Organ Donation: దుబాయ్‌కి చెందిన ఏరీస్ గ్రూప్‌కు చెందిన దాదాపు 1650 మంది ఉద్యోగులు ఇటీవల సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సగానికి పైగా ఉద్యోగులు దుబాయ్‌కు చెందినవారు. మిగిలిన వారు కంపెనీలోని ఇతర కార్యాలయాలకు చెందినవారు. కొచ్చితో సహా వివిధ దేశాల్లో అవయవ దానంపై అవగాహన కల్పించింది ఈ కంపెనీ.
సేవా కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఏరీస్ గ్రూప్ అవయవ దాన ప్రచారం చేయడంతో ఉద్యోగులు ముందుకొచ్చారు. ఏరీస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ రాయ్ మాట్లాడుతూ “అవయవ దానం చేయడం ద్వారా, ఏరీస్ గ్రూప్ ఉద్యోగులలో స్వీయ-సంరక్షణ సంస్కృతిని బలోపేతం చేస్తుంది. వారి శ్రేయస్సు నేరుగా సంస్థాగత విజయాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విధానం వృత్తిపరమైన వృద్ధితో వ్యక్తిగత సంక్షేమాన్ని పెనవేసుకుంటుంది” అని ఆయన అన్నారు.
Also Read: Revanth Reddy: జిల్లాల పర్యటనకు రేవంత్ రెడీ, పాలన యంత్రాంగంపై ఫోకస్!