ఒకప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సినిమా చేయాలనీ ప్రతి ఒక్క నిర్మాత, డైరెక్టర్ కోరుకునేవారు..పవన్ తో సినిమా అనేది ఓ డ్రీమ్ గా భావించేవారు..ఒక్కసారైనా పవన్ ను డైరెక్ట్ చేయాలనీ , పవన్ సినిమా కు నిర్మాతగా ఉండాలని కోరుకునేవారు..పబ్లిక్ గా చెప్పేవారు. అది పవన్ కళ్యాణ్ రేంజ్. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించడం ఒక్క పవన్ కళ్యాణ్ కే చెల్లింది. ఇదంతా కూడా గతం.
కానీ ఇప్పుడు ఆలా లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు రాజకీయాలు (Pawan politics )..మరోవైపు సినిమాలు (Pawan Movies). ఈ రెండిటి ఫై ప్రయాణం చేస్తుండడంతో ఏది సజావుగా ముందుకు సాగడం లేదు. రాజకీయాల్లో (Politics ) ఉండాలంటే సమయం తో పాటు డబ్బు ఉండాలి. ఈ రెండు ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారు. అందుకే పవన్ తన పార్టీ జనసేన (janasena) ను నడిపించేందుకు వరుస సినిమాలు ఒప్పుకుంటూ..ఆ డబ్బుతో పార్టీ ని నడిపిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ రాజకీయాల ద్వారా సినిమాల షూటింగ్ లు ఆడిపోతుండడం తో సదరు నిర్మాతలకు కోట్లాది నష్టం వాటిల్లుతుంది. అంత ఓకే అని నటీనటుల కాల్ షీట్స్ తీసుకొని , షూటింగ్ (Movie Shooting) కు ఏర్పాటు చేసుకొని అంత సెట్స్ పైకి వచ్చేసారికి..పవన్ సడెన్ గా ఏపీ టూర్ (Pawan AP Tour) పెడుతున్నాడు..దీంతో అందర్నీ డేట్స్ , షూటింగ్ వాయిదా పడుతున్నాయి. ఇలా ప్రతిసారి జరుగుతుండడం తో నిర్మాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
మొన్నటి వరకు వారాహి యాత్ర (Varahi Yatra) రెండో షెడ్యూల్ తో కాస్త బిజీ ..బిజీ గా ఉన్న పవన్..అది పూర్తి కాగానే OG ..అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షెడ్యూల్స్ మొదలుపెట్టారు. ఇక ఆపేది లేదు..వరుస షూటింగ్ చేయాల్సిందే అని నిర్మాతలకు , డైరెక్టర్స్ కు భరోసా ఇచ్చారు. పవన్ భరోసా తో వాళ్లు హ్యాపీ అయ్యి షూటింగ్ మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తో అంత తారుమారైంది.
స్కిల్ డెవలప్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu was arrested)..రాష్ట్రంలో సంచలంగా మారింది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బంద్ లు, నిరసనలతో రాష్ట్రం వార్ లోకి వెళ్ళింది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మరోసారి రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చాడు. పవన్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడం తో ఆయన నటిస్తున్న సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. ముఖ్యంగా OG షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది, ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు.అలా షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా పొలిటికల్ హీట్ స్టార్ట్ అయిపొయింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.
Read Also : D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!
ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ మరి కొన్ని రోజుల పాటు కంటిన్యూ అయితే పవన్ సినిమా షూటింగ్స్ మళ్లీ స్టార్ట్ చేసే అవకాశమే లేదు. సినిమాలని కొన్ని రోజులు పూర్తిగా పక్కన పెట్టేసి పవన్ పాలిటిక్స్ పైనే ద్రుష్టి పెడతాడు. ఒకవేళ వీలైతే OG షూటింగ్ ని మాత్రమే కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్..హరిహర వీరమల్లు మాదిరిగానే పక్కకు వెళ్లాల్సిందే. ఏది ఏమైనప్పటికి పవన్ తో సినిమా అనేది ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. గతంలో మాదిరి ప్రస్తుతం పవన్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు. పవన్ రీ ఎంట్రీ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా నిర్మాతలకు లాభాలు తీసుకరాలేకపోయింది.