Padmasri: గణతంత్ర దినోవత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించిన జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది. 2022 ఏడాదికి గాను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, 25 మందికి పద్మశ్రీ పురస్కాలను కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఇద్దరు తెలుగు వారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలంగాణకు చెందిన ప్రొఫెస్ కి, ఏపీకి చెందిన ఓ వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.
తెలంగాణ కు చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి విద్య, సాహిత్యంలో పద్మశ్రీ పురస్కారం లభించగా.. ఏపీ నుండి సంకురాత్రి చంద్రశేఖర్ కు సామాజిక సేవ ( అఫ్రడబుల్ హెల్త్ కేర్ )కు గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ కుమార్ ను పద్మ విభూషణ్ వరించింది.
పద్మశ్రీ పురస్కారాలు పొందిన పలువురు..
రతన్ చంద్రాకర్ (అండమాన్ నికోబర్ ) -మెడిసిన్
హీరాబాయి లోబి ( గుజరాత్ ) – సంఘసేవకురాలు ( ట్రైబల్)
మునీశ్వర్ చందర్ దావర్ (మధ్యప్రదేశ్) – మెడిసిన్
రామ్‌కుయివాంఘ్బే న్యుమె (అస్సాం) – సామాజిక సేవ ( కల్చర్ )
వీపీ అప్పకుట్టన్ పొడువాల్ (కేరళ) – సామాజిక సేవ
వడివేల్ గోపాల్ & మసి సదాయ్యన్ ( తమిళనాడు ) – సామాజిక సేవ ( ఎనిమల్ వెల్ఫేర్ )