Disha App: ‘దిశ’ యాప్ కు బిగ్ రెస్పాన్స్!

గన్నవరం పోలీసులు చేపట్టిన మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్‌లో 1,02,027 మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని నమోదు చేసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Disha

Disha

గన్నవరం పోలీసులు చేపట్టిన మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్‌లో 1,02,027 మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని నమోదు చేసుకున్నారు. మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కట్టుబడి ఉన్నాయని కృష్ణా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. ఎన్‌టిఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్సెస్‌ విద్యార్థులను ఉద్దేశించి ఎస్‌పి మాట్లాడుతూ మహిళలు దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కోరారు. అనంతరం ఎస్పీ యాప్ డెమోను అందించారు. అనంతరం గన్నవరం బస్ స్టేషన్‌ను సందర్శించి ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. మరోవైపు కొత్తగా ఏర్పాటైన బాపట్ల జిల్లాలో లక్ష మందికి పైగా మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన 30 రోజుల్లోనే ఈ మైలురాయిని సాధించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తెలిపారు.

  Last Updated: 14 May 2022, 04:16 PM IST