Site icon HashtagU Telugu

Bollywood Murals: బాలీవుడ్ చిత్రాలు కేరాఫ్ ‘బాంద్రా’

Bollywood

Bollywood

మీరు బాలీవుడ్ అభిమాని అయితే  బాంద్రా సిటీని కచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఖాన్ త్రయం (షారూఖ్, అమీర్ సల్మాన్ ఖాన్) సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది హీరోహీరోయిన్ల ఫొటోలు ఆకట్టుకుంటాయి. అంతేకాదు.. వాళ్ల సినిమాలకు సంబంధించిన మెమోరీస్ ను గుర్తుచేశాయి. సెల్ఫీలు తీసుకునేలా చేస్తాయి. ముంబైలోని మౌంట్ మేరీ సమీపంలోని అమితాబ్ బచ్చన్ 230-అడుగుల చిత్రం, దాదాసాహెబ్ ఫాల్కే ఇర్ఫాన్ ఖాన్ అపరూప చిత్రాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన రంజిత్ దహియా బాలీవుడ్ చిత్రాలు గీస్తూ తన కళను చాటుకుంటున్నాడు. ఈయన బాలీవుడ్‌తో ముంబై అనుబంధాన్ని మరింతగా పెంచడానికి ప్రయత్నిస్తాడు.

‘‘నేను 2009లో ముంబైకి వచ్చాను. ఎంతో అందమైన ముంబై నగరం మురికి కూపంగా మారడం భాధించింది. మనదేశంలోనే ముంబైకి ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడ ఎంతోమంది పేరొందిన కళాకారులున్నారు. అలాంటి ముంబై సిటీలోని కొన్ని భవనాలు కాలుష్యంతో ఇరుగ్గా కనిపించాయి. అందుకే స్ట్రీట్ ఆర్ట్ తో వీధులన్నీ రంగులమయంగా మార్చా. స్ట్రీట్ ఆర్ట్ ద్వారా సెల్యులాయిడ్ ప్రపంచాన్ని నాలాంటి సామాన్యులకు చేరువ చేయాలనేదే నా కల” అని అంటాడు ఈ ఆర్టిస్ట్.

https://twitter.com/firozeshakir/status/1391600438672306179?cxt=HHwWhsC5hbvO-s8mAAAA

Exit mobile version